పాటే నా వ్యాపకం
ఓ శీతాకాలపు రాత్రి ‘ఆల్ ఈజ్ వెల్.. ఎండింగ్ ఈజ్ వెరీ వెల్’ అంటూ ‘మ్యూజిక్ ఫుల్’ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అర్జిత్ సింగ్. మొన్న అఫ్రోజాక్, ఎడ్వర్‌డ మాయా, నిన్న మికాసింగ్.. ఇక ఈ ఇయర్ చివరిలో వచ్చి సిటీని తన పాటల తోటలో విహరింపజేశాడు బాలీవుడ్ సింగర్ అర్జిత్‌సింగ్. ఈ పాటగాడి ప్రతిభ యువతను ఉర్రూతలూగించింది. ‘తుం హి హో’, ‘తుహి మేరి షబ్నం’, ‘బీగి బీగి యాదే’.. వంటి సూపర్‌హిట్ సాంగ్‌సతో హైదరాబాదీల మనసు దోచేశాడు అర్జిత్. గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని గోల్ఫ్ అండ్ కంట్రీక్లబ్ ఆడిటోరియంలో ఈ గళ మాంత్రికుని గాత్రంలో టెక్ పీపుల్, పార్టీ పీపుల్, స్టూడెంట్స్ ఓలలాడారు. ‘ఆశికీ-2’ సాంగ్‌సతో ప్రారంభమైన లైవ్ కన్సర్‌ట శ్రోతల ఆనందోత్సాహాల మధ్య ఆడుతూపాడుతూ సాగింది. వింటర్ నైట్‌ను తన పాటల మ్యాజిక్‌తో వండర్‌ఫుల్‌గా మార్చేసిన అర్జిత్ సింగ్‌తో సిటీప్లస్ ఫటాఫట్..
..:: సిద్ధాంతి
టాలీవుడ్‌లో పాడే అవకాశాలు ఉన్నాయా?
అవకాశం వస్తే నా కంట్రిబ్యూషన్ ఇక్కడ కూడా ఉంటుంది.
మీ పాటల్లో మీకు బాగా నచ్చింది ఏది..?
‘తుం హి హో..’ ఇది నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.
హైదరాబాద్ గురించి...?
ఇట్స్ అమేజింగ్ సిటీ. ఇక్కడ నన్ను అభిమానించే ఫ్యాన్‌స చాలామంది ఉన్నారు. అటువంటి వారి మధ్య నా లైవ్ కన్సర్‌ట
నిర్వహించడం ఆనందంగా ఉంది.
బాలీవుడ్‌లో ఏ సెలబ్రేషన్స్ జరిగినా.. మీ పాట లేకుండా ఉండవని అంటారు.. మీ ఫీలింగ్ ?
ఆ అనుభూతి అద్భుతమైంది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. మ్యూజిక్ ద్వారా నేను పంచుతున్న ఆనందమే.. అభిమానులకు నన్ను దగ్గర చేస్తోంది.
ఈ స్థాయికి చేరుకోవడం వెనుక..?
లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు. దాన్ని అందుకునేందుకు పూర్తి ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ ప్రయత్నంలో అడ్డంకులు ఎదురైతే కుంగిపోకూడదు. అవి మనల్ని మరింత రాటుదేలుస్తాయని గుర్తించుకోవాలి. ముఖ్యంగా మనం చేసే పనిపై మనకంటూ కొన్ని అంచనాలు ఉండాలి. వాటిని అందుకునేలా ప్లానింగ్ ఉండాలి. అదే సక్సెస్ ఆటిట్యూడ్.
మ్యూజిక్ కాకుండా ఇతర వ్యాపకాలేమైనా ఉన్నాయా?
మ్యూజిక్.. మ్యూజిక్.. అదే నా లోకం. సంగీతం నా గుండె చప్పుడు. అది నన్ను ఎప్పటికప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. పాట తప్ప మరే వ్యాపకం నాకు లేదు.