
హైదరాబాద్ : ప్రముఖ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ‘ఏఆర్ రెహమాన్ ఎన్‌కోర్ - ది కన్సర్ట్’ పేరుతో రెహమాన్ దేశ వ్యాప్తంగా నగరాల్లో లైవ్ కన్సర్ట్‌లను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. రెహమాన్ తొలి కన్సర్ట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు హైదరాబాద్ విచ్చేస్తున్న వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా రెహమాన్ కన్సర్ట్‌కు హాజరవుతారని తెలిసింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో కన్సర్ట్ జరగనుంది. అదే సమయంలో హెచ్‌ఐసీసీలో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రినర్ సమ్మిట్(జీఈఎస్)కు 1200 మంది హజరవుతారు.