
Lock Upp: Kangana Ranaut Sexually Assaulted As Child: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ పక్క సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా దూసుకుపోతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన లాకప్ రియాల్టీ షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని కంటెస్టెంట్‌లు ఒక్కొక్కరూ తమ జీవితంలో జరిగిన అనుభవాలను చెప్పి ప్రేక్షకులను షాక్‌కు గురి చేశారు. తాజాగా ఈ షోలోని కంటెస్టెంట్‌తోపాటు తనకు కూడా జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది కంగనా.
జడ్జిమెంట్ డే స్పెషల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ మునావర్ ఫరూఖీ తన చిన్నతనంలో తను అనుభవించిన లైంగిక వేధింపుల గురించి తెలిపాడు. 'నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగిక వేధించారు. నాకు ఆరేళ్లప్పుడు ఈ లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. సుమారు నాలుగైదేళ్లు నరకం చూశాను. ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు.' అంటూ ఎమోషనల్ అయ్యాడు మనావర్ ఫరూఖీ. ఇలాంటి చేదు సంఘటనను ధైర్యంగా ఇలాంటి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై షేర్ చేసుకోవడంతో మునావర్‌పై కంగనా ప్రశంసలు కురిపించింది. తర్వాత తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలిపింది.
చదవండి: షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్
'ఈ సమాజంలో చాలా మంది చిన్న పిల్లలు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పిల్లల పెంపక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా నా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యాను. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా గ్రామంలో ఉండే ఒక అబ్బాయి మాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతను మాకంటే నాలుగేళ్లు మాత్రమే పెద్దవాడు. మేము మా స్నేహితులతో కలిసి ఆడుకునేప్పుడు అతను వచ్చి మమ్మల్ని ఇబ్బందికరంగా తాకేవాడు. మేము అప్పుడు లైంగికంగా బాధింపబడుతున్నామని మాకు తెలియదు.' అని కంగనా రనౌత్ పేర్కొంది.
చదవండి: నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment