జైలు జీవితం నుంచి 'బిగ్‌ బాస్‌' విన్నర్‌గా నిలిచిన కమెడియన్‌ | Munawar Faruqui Is The Hindi Bigg Boss 17 Winner - Sakshi
Sakshi News home page

జైలు జీవితం నుంచి 'బిగ్‌ బాస్‌' విన్నర్‌గా నిలిచిన కమెడియన్‌

Published Mon, Jan 29 2024 10:47 AM | Last Updated on Mon, Jan 29 2024 11:11 AM

Munawar Faruqui Is Hindi Bigg Boss 17 Winner - Sakshi

హిందీ, కన్నడ బిగ్ బాస్ సీజన్స్‌ రియాల్టీ షోలు ఒకే రోజు ముగిశాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 విజేతగా కార్తీక్ మహేష్ నిలుస్తే.. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ట్రోఫీని స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా నటుడు అజయ్ దేవగన్ హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్‌కు హాస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

పోటీలో చివరిగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ అభిషేక్ కుమార్, మునావర్ ఫారూఖీల చేతులు పట్టుకుని స్టేజీపైకి సల్మాన్ వచ్చారు. ఎంతో ఉత్కంఠతకు దారితీసిన ఫైనల్‌ ఎపిసోడ్‌లో 'విజేత' మునావర్ ఫరూఖీని సల్మాన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోయారు. విజేతగా నిలిచిన మునావర్ ఫరూఖీకి రూ.50 లక్షల డబ్బుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. ఆకర్షణీయమైన ట్రోఫీని అందుకున్న మునావర్‌ ప్రేక్షకుల వైపు చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్‌ విన్నర్‌ అతనే అని చాలామంది అభిప్రాయపడ్డారు. అందరూ అనుకుంటున్నట్లే ఆయన విజయం సాధించడంతో అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

జైలు జీవితం నుంచి బిగ్‌ బాస్‌ విజేతగా పయనం
మునావర్‌ ఒక కార్యక్రమంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ గతంలో బీజేపీ ఎంపీ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్‌కు చెందిన మునావర్‌ ఫరూఖీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సుమారు నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయన చివరకు బెయిల్‌ మీద విడుదల అయ్యాడు.

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో 'లాక్ అప్' 2022 సీజన్‌లో మునావర్‌ ఫరూఖీ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా ఆయన బిగ్‌బాస్‌ సీజన్‌లో కూడా విన్నర్‌గా గెలవడంతో ఫ్యాన్స్‌ ఆనందంలో ఉన్నారు. ఈ సీజన్‌లో కామెడీతో పాటు చమత్కారంతో ప్రేక్షకులను మెప్పించిన మునావర్‌.. 17 మందిలో విజేతగా నిలిచాడు.


ఐదో స్థానంలో హైదరాబాద్ యూట్యూబర్‌ 
బిగ్ బాస్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ యువకుడు అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి ఐదో స్థానంలో నిలిచి మెప్పించాడు. శ్రీకాంత్‌ యూట్యూబర్‌గా రానిస్తున్నాడు. సీజన్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఇతగాడు బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించాడు. అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement