ఢిల్లీ: స్టాండప్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూకీకి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో దేశవ్యాప్తంగా మునావర్‌కి వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఇండోర్(మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాని సోమవారం కోర్టు ఆదేశాలు జారీచేసింది.
హిందూ దేవుళ్లను కించపరిచేలా ఓ షోలో మునావర్ వ్యాఖ్యలు చేశాడని, మతపరమైన మనోభావాలు దెబ్బతీశాడని దేశవ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. ఈ మేరకు బెయిల్ మీద బయట ఉన్న మునావర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది.
మునావర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఇండోర్‌కు బదిలీ చేయాలని బెంచ్ ఆదేశించింది. అంతేకాదు.. ఫరూకీకి కల్పించిన మధ్యంతర బెయిల్‌ను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
2021, జనవరి1వ తేదీన ఇండోర్‌లోని 56 దుకాణ్ ఏరియాలోని ఓ కేఫ్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మునావర్ ఓ కామెడీషో నిర్వహించాడు. ఈ షోలోనే మునావర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు ఆ సమయంలో ఉన్న కరోనా ఆంక్షలను సైతం ఉల్లంఘించి మరీ షోను నిర్వహించినట్లు తేలింది. దీంతో మునావర్‌పై పలు చోట్ల ఫిర్యాదు వెళ్లాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు మునావర్‌కు బెయిల్ తిరస్కరించగా.. సుప్రీం కోర్టు మాత్రం 2021, ఫిబ్రవరి 5వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment