స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫరూఖీ అరెస్ట్‌, ఆపై విడుదల | Bigg Boss 17 Winner Munawar Faruqui Detained During Raid At Mumbai Hookah Bar, Released Later - Sakshi
Sakshi News home page

Munawar Faruqui Arrest: స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫరూఖీ అరెస్ట్‌, ఆపై విడుదల

Published Wed, Mar 27 2024 2:28 PM | Last Updated on Wed, Mar 27 2024 3:36 PM

Munawar Faruqui Detained During Raid At Mumbai Hookah Bar Released Later - Sakshi

ముంబై: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌, బిగ్‌బాస్‌ 17 విన్నర్‌ మునావర్‌ ఫరూకీపై కేసు నమోదైంది. ఆయనతోపాటు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ఓ హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడి సందర్భంగా వీరిని అరెస్ట్‌ చేశారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో ఫ‌రూకీ హుక్కా బార్‌లో ఉన్నారు. 

 ఆయ‌న‌కు నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రావ‌డంతో ఫ‌రూకీపై సిగ‌రెట్స్ ఇత‌ర పొగాకు ఉత్ప‌త్తుల చ‌ట్టం, 2003 కింద కేసు న‌మోదు చేశారు. అయితే కేసు నమోదు అనంతరం మునావర్‌ను విడుదల చేసినట్లు బుధవారం ముంబై పోలీసులు వెల్లడించారు.

హుక్కా పార్ల‌ర్‌లో పొగాకు ఉత్ప‌త్తుల్లో నికోటిన్ వాడుతున్నార‌నే స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడులు చేప‌ట్టారు. దాడుల్లో పోలీసులు రూ. 13,500 విలువైన 9 హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు.
చదవండి: Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement