Hookah Centre
-
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ అరెస్ట్, ఆపై విడుదల
ముంబై: ప్రముఖ స్టాండప్ కమెడియన్, బిగ్‌బాస్ 17 విన్నర్ మునావర్ ఫరూకీపై కేసు నమోదైంది. ఆయనతోపాటు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ఓ హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడి సందర్భంగా వీరిని అరెస్ట్ చేశారు. దాడి జరిగిన సమయంలో ఫరూకీ హుక్కా బార్లో ఉన్నారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఫరూకీపై సిగరెట్స్ ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు అనంతరం మునావర్‌ను విడుదల చేసినట్లు బుధవారం ముంబై పోలీసులు వెల్లడించారు. హుక్కా పార్లర్లో పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ వాడుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో పోలీసులు రూ. 13,500 విలువైన 9 హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి: Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు -
హుక్కా కేంద్రాల నిషేధం.. బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి రానుంది.బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని తెలిపారు. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారని పేర్కొన్నారు. చదవండి: TS: అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
పైకి కాఫీ బార్ షాపు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
యలహంక(బెంగళూరు): కాఫీ బార్ పేరుతో అక్రమంగా హుక్కా బార్ నడిపిస్తున్న ముగ్గురిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. దేవనహళ్లి తాలూకా కన్నమంగళ గేటు సమీపంలో కాఫీబార్ పేరుతో హుక్కా బార్ నడిపిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. టెంపోను ఢీకొన్న కారు తుమకూరు: వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై వస్తున్న టెంపో ట్రావెలర్‌ను ఢీకొన్న ఘటనలో కారులోని ముగ్గురు మరణించారు. జిల్లాలోని కుణిగల్ దగ్గర బేగూడరు వద్ద 75వ హైవేపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతులు బెంగళూరు సంజత్ నగరకు చెందిన రఘు (38), హెబ్బాల బీఎల్ సర్కిల్‌కు చెందిన విజయ్ (36), సంతోష్ (28)లు. కారు డ్రైవర్ లోకేష్‌తో పాటు తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బెంగళూరుకు తరలించారు. టెంపోలో ఉన్న వసంత అనే మహిళకు కూడా గాయాలు తగిలాయి. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య.. -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
బ్లాక్స్బర్గ్: అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్‌బర్గ్ డౌన్‌టౌన్‌లోని మెలోడీ హుక్కా లాంజ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
హుక్కా సెంటర్‌పై దాడులు: డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు. ఈ దాడుల్లో మాదక ద్రవ్యాలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వాటర్ హుక్కా సెంటర్‌పై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి 50 గ్రాముల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. -
హుక్కా సెంటర్లపై దాడులు..
బంజారాహిల్స్ రోడ్ నెం. 10, 12లలో ఉన్న హుక్కా సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించి పోలీసు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అడ్డదారిలో హుక్కా సరఫరా చేస్తున్న కాఫీషాపులపై పోలీసులు దాడులు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని క్రేవ్ హుక్కా సెంటర్లో హుక్కా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. అయితే ఈ నిర్వాహకుడు అలీ ప్రధాన గేటు మూసివేసి పోలీసులు లోనికిరాకుండా అడ్డుకున్నాడు. మూడు గంటల పాటు కస్టమర్లను లోపలే ఉంచి బయట నుంచి తాళాలు వేయించి పోలీసులు రాకుండా హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు నిర్వాహకుడిపై ఐపీసీసెక్షన్ 341, 188, 186 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే రోడ్‌నెం. 12లోనే ఉన్న నోస్టాల్జియా, స్కై పార్క్, రోడ్‌నెం. 10లో ఉన్న వాటర్, లెవల్స్ బిస్ట్రో తదితర హుక్కాసెంటర్లపై కూడా దాడులుచేసి పోలీసులు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ హుక్కా సరఫరా చేస్తున్నందుకుగాను క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిర్వాహకులను అరెస్టు చేశారు. హుక్కా సరఫరా పూర్తిగా నిషేధించాలని సరఫరా చేస్తే దాడులు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామని వెల్లడించారు. హుక్కా సరఫరా చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు. హుక్కా సరఫరా జరిగినట్లు తేలితే సెక్టార్ ఎస్ఐలదే బాధ్యత అని ఉన్నతాధికారులు పేర్కొన్న నేపథ్యంలో హుక్కా సెంటర్లు, కాఫీ షాపులపై అర్ధరాత్రి 3 గంటల దాకా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. -
హుక్కా సెంటర్లపై దాడి :నలుగురి అరెస్టు
హైదరాబాద్: నగరంలోని హుక్కా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేశారు. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిఫెన్స్ కాలనీలో నిర్వహిస్తున్న రెండు హుక్కా సెంటర్లపై దాడి నిర్వహించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.