థానే వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) తొట్టతొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ లీగ్ ప్రారంభ వేడుకలలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మెగా పపర్ స్టార్ రాంచరణ్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ నటుడు సూర్య, భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, సురేష్ రైనా ఈ వేడుకల్లో భాగమయ్యారు.
అయితే ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుపడుతూ అభిమానులను అలరించాడు.
కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన మంచి ఊపు మీద కన్పించిన సచిన్.. స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన సచిన్.. మరో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఐఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నీ విషయానికి వస్తే.. ఇది టీ10 ఫార్మాట్‌లో టెన్నిస్ బాల్‌తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు.
.@ispl_t10 is poised to amaze us all, much like Munawar did by dismissing the 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 👀 🤯 #SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo pic.twitter.com/801LO25ilh
— Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024
Comments
Please login to add a commentAdd a comment