కొండా సినిమాతో గుర్తింపు సంపాదించాడు ప్రశాంత్ కార్తి. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఆయనకు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు కొండా చిత్రంతో వచ్చింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సివిల్ కాంట్రాక్టర్ నుంచి నటుడిగా మారాను. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు రెండుసార్లు జైలుకెళ్లాను. వేరేవాళ్లకోసం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చాను. నాకు నక్సలైట్ ఆర్కే అంటే ఇష్టం. ఆయన ప్రజల కోసం పోరాడింది పుస్తకాల్లో చదివాను. నా అదృష్టం కొద్దీ ఆయన పాత్రలో నటించాను.
నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. మధ్యలో కొన్ని కారణాల వల్ల ట్రాక్ తప్పాను. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారే నాకు స్ఫూర్తి. ఈమధ్యే అనంత సినిమా తీశాను. నేనే హీరోగా చేసి నిర్మించాను. ఇండస్ట్రీలో చాలా రాజకీయాలుంటాయి. వాటిని తట్టుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.
Comments
Please login to add a commentAdd a comment