ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై పూజలు నిర్వహించడానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. పల్లకి సేవ, పంచ హారతులు, దర్బార్ సేవలో భక్తులను అనుమతించాలని దుర్గ గుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో పూజల టిక్కెట్లను అధికారులు విడుదల చేయనున్నారు.
దుర్గమ్మకు నవ హారతులు
పవిత్ర కృష్ణమ్మకు శుక్రవారం నుంచి నవ హారతులు తిరిగి ప్రారంభించేందుకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దుర్గగుడి ఫ్లైఓవర్ పనులలో భాగంగా ఈ ఏడాది జనవరిలో నవ హారతులను నిలిపివేశారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తికావడంతో శుక్రవారం నుంచి తిరిగి హారతులను ప్రారంభించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. నవ హారతుల కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు పూర్తిచేశారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పంచహారతుల అనంతరం దుర్గాఘాట్‌లో నవ హారతులు ప్రారంభం అవుతాయని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment