డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ‘ఉగ్రం’ తన సినీ కెరీర్‌లో ఓ హైలెట్ చిత్రంగా నిలిచి పోతుందని ఆ చిత్ర హీరో అల్లరి నరేష్ స్పష్టం చేశారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఆదివారం చిత్ర యూనిట్ సందడి చేసింది. నాంది చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రమే ఉగ్రం. అల్లరి నరేష్‌కు జతగా మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో నరేష్ మాట్లాడుతూ తన 60వ చిత్రం ఉగ్రంతో మీ ముందుకు వస్తున్నానన్నారు. నాంది సినిమాకు మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా సాగుతుందన్నారు.
(చదవండి: అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్)
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసిందేనని, వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదంటూ రూపొందించిందే ఉగ్రం చిత్రమని పేర్కొన్నారు. ఈ నెల 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నరేష్ తెలిపారు. మిస్సింగ్ కేసులు పరిష్కరించే పోలీస్ పాత్రలో నటించానని, ఇప్పటి వరకు ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. హీరోయిన్ మిర్నా మీనన్ మాట్లాడుతూ తెలుగులో ఇది తనకు రెండో చిత్రమన్నారు. అల్లరి నరేష్ చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, కెమెరామన్‌గా సిద్ వ్యవహరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment