Vijay Kanakamedala
-
అల్లరి నరేష్ 3 రోజుల్లో 400 సిగరెట్లు తాగి..
-
ఈ సినిమాలో అల్లరి నరేష్ తో చేయడానికి కారణం ఏంటంటే...
-
ఇండస్ట్రీలో ఉండాలా.. వద్దా.. అని తేల్చుకొని సినిమా చేశాను
-
ఉగ్రం మూవీ సక్సెస్ సెలబ్రేషన్...
-
గ్యాంగ్ స్టర్ గా పాన్ ఇండియా సినిమా?
-
ఆడియన్స్ పెట్టిన కామెంట్స్ విని ఎమోషనల్ అయినా అల్లరి నరేష్
-
ఆ ఏజ్ లో పాప టాలెంట్,యాక్టింగ్ చూసి షాక్...అయ్యా బాబోయ్ చిచ్చరపిడుగు
-
సినిమా నచ్చకపోతే డైరెక్టర్ గా తిడుతున్నారు..
-
Ugram Movie : 'ఉగ్రం' చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
డైరెక్టర్ విజయ్ కనకమేడల అతని సినిమా పై కాంఫిడెన్స్
-
ఉగ్రం నా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది
‘‘నేను పోలీసాఫీసర్‌గా చేసిన ‘కత్తి కాంతారావు’, ‘బ్లేడ్ బాజ్జీ’ చిత్రాలు విజయాలు సాధించాయి. అయితే ఇవి కామెడీ చిత్రాలు. కాగా నేను సీరియస్ పోలీస్ పాత్ర చేసిన ‘ఉగ్రం’ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ఉగ్రం’ నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను చేసిన ఫైట్స్ నవ్వించడం కోసం... ఈ సినిమాలో ఎమోషన్ కోసం యాక్షన్ సీన్స్ చేశాను’’ అన్నారు. ‘‘నాంది’ సినిమాకు మూడురెట్ల వసూళ్లు ‘ఉగ్రం’ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది’’ ఉన్నారు విజయ్ కనకమేడల. ‘‘భారతదేశ వ్యాప్తంగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ మిస్సింగ్స్ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. పక్కా ఆధారాలతో వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ‘ఉగ్రం’ కథ రెడీ చేశాం’’ అన్నారు రచయిత వెంకట్. కామెడీ సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. నా తర్వాతి సినిమా కామెడీ జానర్లోనే ఉంటుంది. అయితే కొందరు నాకు కామెడీ కథలు చెప్పేటప్పుడు వాళ్లకు వాళ్లే ఎగ్జయిట్ అయ్యి, నవ్వేసుకుంటున్నారు. నాకు నవ్వు రావడం లేదు. ఆడియన్స్ ఆర్గానిక్ కామెడీని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ‘కితకితలు’ సినిమా చేస్తే బాడీ షేమింగ్ అని తిడతారు. కుటుంబసమేతంగా చూసే కామెడీ సినిమాలు తీయాలన్నప్పుడు అందులో అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండకూడదు. చెప్పాలంటే కామెడీ సినిమాల రైటర్స్ తగ్గిపోయారు. – ‘అల్లరి’ నరేశ్ -
అల్లరి నరేష్ తన భార్య కూతురు గురించి పొగడ్తలు
-
Ugram Pre Release: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు) -
ఉగ్రం సినిమా చూసి నా కూతురు అన్న మాటకి...
-
చావో రేవో తేల్చుకుందాం అని సినిమా చేశాను.. యాక్షన్ సీన్స్ లో నరేష్ ఇరగదీశాడు
-
నా కెరీర్లో మైలురాయిగా ‘ఉగ్రం’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ‘ఉగ్రం’ తన సినీ కెరీర్లో ఓ హైలెట్ చిత్రంగా నిలిచి పోతుందని ఆ చిత్ర హీరో అల్లరి నరేష్ స్పష్టం చేశారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఆదివారం చిత్ర యూనిట్ సందడి చేసింది. నాంది చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన చిత్రమే ఉగ్రం. అల్లరి నరేష్‌కు జతగా మిర్నా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో నరేష్ మాట్లాడుతూ తన 60వ చిత్రం ఉగ్రంతో మీ ముందుకు వస్తున్నానన్నారు. నాంది సినిమాకు మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా సాగుతుందన్నారు. (చదవండి: అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్) కోవిడ్ లాక్డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసిందేనని, వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదంటూ రూపొందించిందే ఉగ్రం చిత్రమని పేర్కొన్నారు. ఈ నెల 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నరేష్ తెలిపారు. మిస్సింగ్ కేసులు పరిష్కరించే పోలీస్ పాత్రలో నటించానని, ఇప్పటి వరకు ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. హీరోయిన్ మిర్నా మీనన్ మాట్లాడుతూ తెలుగులో ఇది తనకు రెండో చిత్రమన్నారు. అల్లరి నరేష్ చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, కెమెరామన్‌గా సిద్ వ్యవహరించారన్నారు. -
అప్పుడు ఉగ్రం ఆలోచన వచ్చింది
‘‘హీరోల క్యారెక్టరైజేషన్ చుట్టూ కథలు అల్లడంపై ప్రస్తుతం నాకు ఆసక్తి లేదు. నేను రాసే కథలు హీరో సెంట్రిక్‌గా ఉంటాయి. ఒకవేళ భవిష్యత్తులో పెద్ద హీరోలు అవకాశం ఇస్తే అప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తానేమో. ఇప్పుడైతే ఓ అంశంతో కథను అల్లుకుని పాత్రలను సృష్టించుకుంటున్నాను. సామాజిక అంశాలకు వాణిజ్యపరమైన హంగులు జోడించి కథలు చెప్పడం నాకు ఆసక్తి’’ అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉగ్రం’. ఇందులో మీర్నా మీనన్ హీరోయిన్. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ కనకమేడల చెప్పిన విశేషాలు. ► ‘నాంది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత లాక్డౌన్ వల్ల కొంత సమయం దొరికింది. అప్పుడు ‘ఉగ్రం’ కథ రాసుకున్నాను. ప్రతిరోజూ మిస్సింగ్ వార్తలను గమనిస్తూనే ఉన్నాం. తెలంగాణ హైకోర్టు మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుందనే అంశంపై కథ చేస్తే బావుంటుందనిపించి, ‘ఉగ్రం’ కధ రెడీ చేశాం. తూము వెంకట్ నా ఫ్రెండ్. కథల గురించి మేం ఇద్దరం ఆలోచిస్తూనే ఉంటాం. మా కో–ఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఐడియాల షేరింగ్ ఎలా ఉన్నా తనది కథ, నాది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ క్రెడిట్ అనుకున్నాం. అలా కొనసాగుతున్నాం. ► ‘ఉగ్రం’ స్క్రిప్ట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. కథలో క్యారెక్టరైజేషన్ ప్రకారమే యాక్షన్ సీక్వెన్స్‌లు వస్తాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించడానికి ముందు కొంత రిహార్సల్స్ చేశాం. వీటి వల్ల నరేశ్‌గారి బాడీ లాంగ్వేజ్, ఫిట్‌గా ఉండటం వంటి అంశాలు మరింత మెరుగుపడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. మిర్నా చేసిన గత సినిమాలు చూశాను. ఆడిషన్స్‌కు పిలిచి ఆమెను ఎంపిక చేసుకున్నాం. బాగా యాక్ట్ చేశారు. ► నరేశ్‌గారు ఆల్ రౌండర్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. నా దృష్టిలో ఆయన కామెడీ హీరో కాదు. హీరోగా ఎక్కువగా కామెడీ చిత్రాలు చేశారంతే. ‘ఉగ్రం’లో ఇంటెన్స్, ఎమోషన్స్ ఉన్న పోలీసాఫీసర్‌గా ఆయన బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్, ఫ్యామిలీ, టైటిల్ ట్రాక్స్ ఉన్నాయి. అయితే ఈ పాటలు కథను డిస్ట్రబ్ చేయవు. ఈ పాటల్లో కూడా కథ కొనసాగుతుంటుంది. -
అప్పుడు భయం వేసింది
‘‘నా చిన్నతనం నుంచే నేను యాక్టర్‌ని కావాలనుకున్నాను. యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. అయితే కెరీర్‌ను స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే రజనీకాంత్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి సూపర్ స్టార్స్‌తో నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ మిర్నా మీనన్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూ΄÷ందిన చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్గా నటించారు. సాహు గార΄ాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మిర్నా మీనన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీఫెలో’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాను. రజనీకాంత్‌గారి ‘జైలర్’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను. సెట్స్‌లో రజనీగారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ మాట, నడక అన్నింటిలో ఓ స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్‌తోనే పుట్టి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే నాకు ‘ఉగ్రం’కి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను కాలేజీ అమ్మాయిలా, గృహిణిలా, ఓ బిడ్డకు తల్లిలా పలు షేడ్స్‌లో కనిపిస్తాను. ఒకే సినిమాలో విభిన్న రకాల లుక్స్‌తో కనిపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌కు ఓ మీనింగ్ ఉంటుంది. ‘ఉగ్రం’ కోసం దాదాపు 70 రోజులు వర్క్ చేశాను. ఇందులో 55 రోజులు నైట్ షూట్ చేశాం. కంటిన్యూస్‌గా 15 రోజులు నైట్‌షూట్‌లో ΄ాల్గొన్నాను. ఓసారి బ్రేక్ లేకుండా 48 గంటలు వర్క్ చేశాను. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రైలర్లో చూసిన కారు యాక్సిడెంట్ సీన్ మేం రియల్‌గానే చేశాం. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నరేశ్‌గారికి చిన్న΄ాటి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం అమీర్‌గారి డైరెక్షన్లో ఓ తమిళ సినిమా చేస్తున్నాను. మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యాను’’ అన్నారు. -
‘మిస్సయిన 1.5 లక్షలమంది ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు’
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన మరో చిత్రం ఉగ్రం. ఈ చిత్రంలో మీర్నామీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఖమ్మంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీసు పాత్రలో అల్లరి నరేశ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో అలరించనున్నారు. ట్రైలర్ చివర్లో 'ఒక మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం.. అదే మనిషి కనిపించకుండా పోతే మనం పోయేంత వరకు గుర్తు చేసుకుంటూ బాధపడతాం.' డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్‌కి, దేవరి అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సిద్.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించారు. (ఇది చదవండి: రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!) ఈవెంట్లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. 'ఇది నా కెరీర్లో 60వ సినిమా. మహర్షిలో నేను పోషించిన పాత్ర నచ్చడంతో అలాంటి రోల్లో ఓ సినిమా చేద్దామన్నారు దర్శకుడు విజయ్. అలానే నాందిని తెరకెక్కించాం. మంచి విజయం సాధించింది. మళ్లీ ఉగ్రం సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రం నాందికి మించి ఉంటుంది. మిస్సింగ్ కేసుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా తీస్తున్నప్పుడు లాక్డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసింది. వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు.' అంటూ ఎమోషనలయ్యారు. -
ఉగ్రం టీజర్ అదిరిపోయింది
‘‘ఉగ్రం’ సినిమా టీజర్ అదిరిపోయింది.. నెక్ట్స్ లెవల్లో ఉందనిపించింది. ‘నాంది’ తర్వాత నరేష్ మళ్లీ అలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో నాగచైతన్య అన్నారు. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ‘అల్లరి’ నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని నాగచైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నరేష్ , విజయ్ కాంబినేషన్ ఒక బ్రాండ్లా ఉంది. సాహు, హరీష్ అద్భుతమైన నిర్మాతలు. నా కెరీర్లో ‘మజిలీ’ వంటి మంచి సినిమా ఇచ్చారు వారు. ఆ సినిమాలా ‘ఉగ్రం’ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. నరేష్ మాట్లాడుతూ– ‘‘ఒక నటుణ్ణి దర్శకుడు ఎంత నమ్మితే అన్ని మంచి విజయాలు వస్తాయి. మా నాన్నగారు (ఈవీవీ సత్యనారాయణ) నన్ను నమ్మినప్పుడు వరుస విజయాలు వచ్చాయి. క్రిష్‌గారు నన్ను నమ్మినప్పుడు ‘గమ్యం’, సముద్రఖని నమ్మినప్పుడు ‘శంభో శివ శంభో’ వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత ‘నాంది’తో విజయ్ నాకు కొత్త రూటు చూపించారు’’ అన్నారు. ‘‘నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘నాంది’ విజయం చూపించింది.. ‘ఉగ్రం’ కూడా అంతే నిజాయితీగా ఉంటుంది’’ అన్నారు విజయ్ కనకమేడల. -
‘అల్లరి’ నరేశ్.. ఉగ్రం ఆరంభం
‘నాంది’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందుతున్న మరో సినిమా ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తూము వెంకట్ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతదర్శకత్వం వహిస్తుండగా, సిధ్ కెమెరామేన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ హీరోయిన్ను పరిచయం చేసిన మూవీ టీం
హిట్ ఫిల్మ్ ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ఇందులో మిర్నా మీనన్ కథానాయికగా నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తూము వెంకట్ కథను అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిద్. -
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రారంభం (ఫొటోలు)
-
నాంది డైరెక్టర్‌తో వన్స్‌మోర్ అంటున్న అల్లరి నరేశ్
నాంది సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు హీరో అల్లరి నరేశ్. తాజాగా అతడు 60వ సినిమా మొదలుపెట్టాడు. తనకు భారీ విజయం అందించిన నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలకే మరోసారి అవకాశం ఇచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. నరేశ్- విజయ్‌ల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఇందులో సంకెళ్లు ఉన్న రెండు చేతులు గోడపై స్వేచ్ఛను కోరుతున్న పక్షిలా కనిపించేలా డిజైన్ చేశారు. షాడో ఆఫ్ హోప్ (ఆశ యొక్క నీడ) అంటూ దీన్ని అల్లరి నరేశ్ ట్వీట్ చేశాడు. ఇకపోతే అల్లరి నరేశ్ ప్రస్తుతం మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! My 60th and our 2nd together…#ShadowOfHope @vijaykkrishna @sahugarapati7 @harish_peddi @Shine_Screens #NareshVijay2 pic.twitter.com/9eZ6RtBgPS — Allari Naresh (@allarinaresh) June 27, 2022 Wait for it…. @12.07pm today. @vijaykkrishna @sahugarapati7 @Shine_Screens pic.twitter.com/tw4Aio3bVC — Allari Naresh (@allarinaresh) June 27, 2022 చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్ ఆ సినిమాలో నటించమంటూ హీరోకు రూ.2355 కోట్లు ఆఫర్ -
ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్