Allari Naresh And Vijay Kanakamedala Announce New Movie - Sakshi
Sakshi News home page

#NareshVijay2: నాంది దర్శకుడితో అల్లరి నరేశ్‌ 60వ సినిమా

Published Mon, Jun 27 2022 5:38 PM | Last Updated on Mon, Jun 27 2022 6:41 PM

Naresh, Vijay Kanakamedala Announce New Movie, See Poster - Sakshi

నాంది సినిమాతో మంచి సక్సెస్‌ అందుకున్నాడు హీరో అల్లరి నరేశ్‌. తాజాగా అతడు 60వ సినిమా మొదలుపెట్టాడు. తనకు భారీ విజయం అందించిన నాంది డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడలకే మరోసారి అవకాశం ఇచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్‌, టక్‌ జగదీష్‌ సినిమాలను నిర్మించిన షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఓ వీడియో రిలీజ్‌ చేశారు. 

నరేశ్‌- విజయ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ సైతం విడుదల చేశారు. ఇందులో సంకెళ్లు ఉన్న రెండు చేతులు గోడపై స్వేచ్ఛను కోరుతున్న పక్షిలా కనిపించేలా డిజైన్‌ చేశారు. షాడో ఆఫ్‌ హోప్‌ (ఆశ యొక్క నీడ) అంటూ దీన్ని అల్లరి నరేశ్‌ ట్వీట్‌ చేశాడు. ఇకపోతే అల్లరి నరేశ్‌ ప్రస్తుతం మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!

చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్‌, కాజల్‌ టాప్‌
ఆ సినిమాలో నటించమంటూ హీరోకు రూ.2355 కోట్లు ఆఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement