నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందించిన మరో చిత్రం ఉగ్రం. ఈ చిత్రంలో మీర్నామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఖమ్మంలో రిలీజ్ చేసింది చిత్రబృందం.
ట్రైలర్ చూస్తే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీసు పాత్రలో అల్లరి నరేశ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో అలరించనున్నారు. ట్రైలర్ చివర్లో 'ఒక మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం.. అదే మనిషి కనిపించకుండా పోతే మనం పోయేంత వరకు గుర్తు చేసుకుంటూ బాధపడతాం.' డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్‌కి, దేవరి అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సిద్.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించారు.
(ఇది చదవండి: రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!)
ఈవెంట్‌లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. 'ఇది నా కెరీర్‌లో 60వ సినిమా. మహర్షిలో నేను పోషించిన పాత్ర నచ్చడంతో అలాంటి రోల్‌లో ఓ సినిమా చేద్దామన్నారు దర్శకుడు విజయ్. అలానే నాందిని తెరకెక్కించాం. మంచి విజయం సాధించింది. మళ్లీ ఉగ్రం సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రం నాందికి మించి ఉంటుంది. మిస్సింగ్ కేసుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా తీస్తున్నప్పుడు లాక్‌డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసింది. వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు.' అంటూ ఎమోషనలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment