‘‘నా చిన్నతనం నుంచే నేను యాక్టర్‌ని కావాలనుకున్నాను. యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. అయితే కెరీర్‌ను స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే రజనీకాంత్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి సూపర్ స్టార్స్‌తో నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ మిర్నా మీనన్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూ΄÷ందిన చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటించారు.
సాహు గార΄ాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మిర్నా మీనన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీఫెలో’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాను. రజనీకాంత్‌గారి ‘జైలర్’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను. సెట్స్‌లో రజనీగారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ మాట, నడక అన్నింటిలో ఓ స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్‌తోనే పుట్టి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే నాకు ‘ఉగ్రం’కి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను కాలేజీ అమ్మాయిలా, గృహిణిలా, ఓ బిడ్డకు తల్లిలా పలు షేడ్స్‌లో కనిపిస్తాను.
ఒకే సినిమాలో విభిన్న రకాల లుక్స్‌తో కనిపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌కు ఓ మీనింగ్ ఉంటుంది. ‘ఉగ్రం’ కోసం దాదాపు 70 రోజులు వర్క్ చేశాను. ఇందులో 55 రోజులు నైట్ షూట్ చేశాం. కంటిన్యూస్‌గా 15 రోజులు నైట్‌షూట్‌లో ΄ాల్గొన్నాను. ఓసారి బ్రేక్ లేకుండా 48 గంటలు వర్క్ చేశాను. ఇదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ట్రైలర్‌లో చూసిన కారు యాక్సిడెంట్ సీన్ మేం రియల్‌గానే చేశాం. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నరేశ్‌గారికి చిన్న΄ాటి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం అమీర్‌గారి డైరెక్షన్‌లో ఓ తమిళ సినిమా చేస్తున్నాను. మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment