
ఖుష్బూ.. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన గొప్ప నటి. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకొవచ్చు. ఆమెతో కలిసి నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపేవారట. ఖుష్బు కూడా దాదాపు అందరికి స్టార్లలతో కలిసి నటించింది. కానీ తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం ఇప్పటికీ రాలేదని తెగ ఫీలవుతుంది. ఇంతకీ ఖుష్బూ అభిమాన హీరో ఎవరో తెలుసా? బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆయన అంటే ఆమెకు చచ్చేంత ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడింది.
(చదవండి: ప్రభాస్ ‘ఆదిపురుష్’కు అరుదైన గౌరవం)
‘అమితాబ్ బచ్చన్‌గారికి నేను చాలా పెద్ద అభిమానిని. నా బెడ్ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి. ఆయనతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. కానీ జోడీగా చేయలేదనే బాధ ఉంది. ‘చీనీ కమ్’ చిత్రంలో అమితాబ్‌గారితో టబు నటించింది. ఆ చాన్స్ నాకు రాలేదని బాధపడ్డాను’అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బు..ఇప్పుడు సహయనటిగా మెప్పిస్తుంది. తాజగా ఆమె గోపిచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’లో కీలక పాత్ర పోషించింది. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment