ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల యుగం నడుస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లోపే ఓటీటీలో ప్రత్యక్షం కావాల్సిందే. ఇక చిన్న సినిమాలు వారంలోపే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరికొన్ని సినిమాలైతే డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు. ఇక సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మూడు వారాల్లోనే ఓటీటీకి రావడం మన చూశాం. అలాంటిది రిలీజ్ అయి కూడా నెలలు దాటిపోతున్నా ఇంకా ఓటీటీకి రాకపోవడమేంటి? ఆ సినిమాలు ఎందుకు ఓటీటీలోకి రావడం లేదు. ఈ ఏడాదిలోనే రిలీజై కూడా ఇప్పటివరకు రాలేదంటే.. ఆ సినిమాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అందులోనూ మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయంటే.. అందుకు గల కారణాలేంటో ఓ లుక్కేద్దాం.
ఏజెంట్ ఇంకెప్పుడు?
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
(ఇది చదవండి: తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట)
ఇప్పటికీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కన్‌ఫ్యూజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి సమాచారం లేదు.
ది కేరళ స్టోరీ ఇంకా రాదా?
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తయ్యాక ఓటీటీకి వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఆదా శర్మ సైతం ఏ ఓటీటీకి ఇవ్వాలేనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. గతంలో జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు.
ఓటీటీకి గురిపెట్టని రామబాణం
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలు పోషించారు. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. గతంలోనే జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మరి రామబాణం ఓటీటీ రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే.
(ఇది చదవండి: ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్)
జర హట్కే జర బచ్కే ఎప్పుడొస్తుంది?
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం జర హట్కే జర బచ్కే. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాలేదు. ఇప్పటికే జియో సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. మరీ ఇన్ని రోజులైనా ఓటీటీకి రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చూద్దామని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జ్విగాటో
స్టాండప్ కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కపిల్ శర్మ. నందితా దాస్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జ్విగాటో. షహనా గోస్వామి హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు టొరంటో వరల్డ్‌వైడ్ ఫిల్మ్ సెలబ్రేషన్స్-2022లోనూ ప్రదర్శితమైంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆరునెలలైనా ఓటీటీకి రాకపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. అగ్ర హీరోల సినిమాలే నెల రోజుల్లోపే ఓటీటీకి వస్తుంటే.. ఈ చిత్రాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment