సమ్మర్‌పై గురిపెట్టిన ‘రామబాణం’ | Gopichand Latest Movie Rama Banam Release Date Out | Sakshi
Sakshi News home page

సమ్మర్‌పై గురిపెట్టిన ‘రామబాణం’

Published Sun, Mar 5 2023 9:11 AM | Last Updated on Sun, Mar 5 2023 9:11 AM

Gopichand Latest Movie Rama Banam Release Date Out - Sakshi

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్స్‌తో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ చేస్తున్న మూడో చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన డింపుల్‌ హయతి కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్రం కొత్త పోస్టర్‌ని విడుదల చేసి, మే 5న చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

‘‘ఈ చిత్రంలో గోపీచంద్‌ చేస్తున్న విక్కీ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రత్యేకమైన మేకోవర్‌తో గోపీచంద్‌ లుక్‌ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ‘లక్ష్యం, లౌక్యం’లను 
మించేలా ‘రామబాణం’ ఉండాలని శ్రీవాస్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలు ముగిశాక, వేసవిలో వినోదం పంచడానికి మా ‘రామబాణం’ దూసుకు రానుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: వెట్రి పళనిస్వామి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement