
రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో తనదైన అందం, యాక్టింగ్‌తో యువత గుండెలను కొల్లగొట్టిన బ్యూటీ డింపుల్ హయాతి. ప్రస్తుతం ఈ భామ మ్యాచోస్టార్ గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’లో నటించింది. ఈ సినిమా మే 5వ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయన్ డింపుల్ హయాతి అసహనం వ్యక్తం చేసింది.
రామబాణం టీమ్ బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి, దర్శకుడు శ్రీవాస్‌తో పాటు మిగిలిన టీమ్ సభ్యులంతా మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ‘ఈ మధ్య డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్‌గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. కొంచెం రొమాంటిక్‌గా అనిపిస్తోంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ.. మీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది?’ అని హీరోయిన్‌ని అడిగారు.
(చదవండి: వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?)
వల్గర్ అనే పదం వినగానే ఒకింత అసహనానికి గురైన డింపుల్.. ‘వల్గర్ అంటారేంటి? నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ చూడలేదు. గ్లింప్సస్ కూడా అలాంటివేవీ వదల్లేదు అనుకుంటున్నాను. మా సినిమా పాటల్లో, పోస్టర్లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటుంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు’ అని నవ్వుతూనే తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
(చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు)
దీంతో వెంటనే దర్శకుడు శ్రీవాస్ జోక్యం చేసుకొని .. ‘ఈ ప్రెస్ మీట్‌కి ఆమె వేసుకొన్ని డ్రెస్ చూస్తేనే ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇదొక ఒక ట్రెడిషనల్ సినిమా. ట్రెడిషనల్‌గా ఉండాలని వెస్టరన్ డ్రెస్‌లు నేను వేసుకోనండి అని సంప్రదాయ దుస్తుల్లో ప్రచార కార్యక్రమాలకు వస్తోంది. వీటిని బట్టి సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థమవ్వాలి’ అని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment