'iPhone' Song Released from Gopichand's Ramabanam movie - Sakshi
Sakshi News home page

Ramabanam Movie: గోపీచంద్ రామబాణం.. 'ఐ ఫోన్' లిరికల్ సాంగ్ రిలీజ్

Published Fri, Apr 7 2023 10:01 AM | Last Updated on Fri, Apr 7 2023 11:05 AM

Gopichand Ramabanam Movie I phone Song Release - Sakshi

గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్‌  కానుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ ఫోన్‌..’ అనే మాస్‌ పాటని గురువారం విడుదల చేశారు మేకర్స్.

ఈ చిత్రం యాక్షన్‌ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్‌ పాటలు రాయడంలో స్పెషలిస్ట్‌ అయిన కాసర్ల శ్యామ్‌ తెలంగాణ యాసలో ఈ పాటను రాశారు. రామ్‌ మిరియాల, మోహనా భోగరాజు ఆలపించారు. ఈ సాంగ్‌లో గోపీచంద్, డింపుల్‌ మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ప్రేక్షకులను విపరీకంగా ఆకట్టుకుంటాయి అని చిత్రబృందం‌ తెలిపింది. జగపతిబాబు, ఖుష్బు, అలీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement