మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఏపీలోని రాజమండ్రిలో రిలీజ్ చేశారు మేకర్స్.
'ఈ క్షణం.. ఈ ప్రయాణం.. నేను ఊహించింది కాదు.. ప్లాన్ చేసింది కాదు..' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. జగపతిబాబు, ఖుష్బు ఇందులో కీలక పాత్రలఉ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Here it is..#RamabanamTrailer is out now!
— Gopichand (@YoursGopichand) April 20, 2023
- https://t.co/e2FEBTIxKm#RamaBanam in Theatres from MAY 5th#RamabanamOnMay5@DirectorSriwass @IamJagguBhai @khushsundar @DimpleHayathi @MickeyJMeyer @peoplemediafcy
Comments
Please login to add a commentAdd a comment