ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద సినిమాలు సైతం రిలీజైన నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ వారంలో మిమ్మల్ని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.
మెగాస్టార్ భోళాశంకర్
మెగాస్టార్ భోళాశంకర్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించగా... తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ సెప్టెంబర్ 15 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
గోపీచంద్ రామబాణం
గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతంగా మెప్పించలేకపోయింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 14వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు నెట్‌ఫ‍్లిక్స్ తెలిపింది.
మాయపేటిక
విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించిన చిత్రం మాయపేటిక. ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మొబైల్ ఫోన్ వల్ల చెడు, మంచి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
అనీతి
వసంతబాలన్ దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ మూవీ అనేతి. ఈ చిత్రంలో అర్జున్ దాస్, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హౌస్ కీపర్‌తో ప్రేమలో పడే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ముగ్గురు యువకుల డిజిటల్ విలేజ్
ఫహద్ నందు, ఉల్సవ్ రాజీవ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం డిజిటల్ విలేజ్. ఇందులో హృషికేష్, ఇందిర, ఎంసీ మోహనన్, సురేష్ బాబు కన్నోమ్ నటించారు. తమ గ్రామంలోని ప్రజలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ముగ్గురు స్నేహితుల స్టోరీనే కథాంశంగా చూపించారు. ఈ సినిమా ఈనెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
జర్నీ ఆఫ్ లవ్ 18+
నాస్లెన్ గఫూర్, మీనాక్షి దినేష్, మాథ్యూ థామస్, నిఖిలా విమల్ నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ . అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్
హేలీ లు రిచర్డ్‌సన్, బెన్ హార్డీ, రాబ్ డెలానీ, సాలీ ఫిలిప్స్, జమీలా నటించిన చిత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దీనికి వెనెస్సా కాస్విల్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటికి డ్రామాను ఓ విమానంలో చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హాలీవుడ్ చిత్రాలు
- వైఫ్ లైక్- నెట్‌ఫ్లిక్స్- 11 సెప్టెంబర్ 2023
- ఎలిమెంటల్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- 13 సెప్టెంబర్ 2023
- ఎ మిలియన్ మైల్స్ అవే- అమెజాన్ ప్రైమ్ వీడియో- 15 సెప్టెంబర్ 2023
Comments
Please login to add a commentAdd a comment