జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్ ప్రసాద్‌కు సాయం చేసేందుకు పలువురు కంటెస్టెంట్స్ అండగా నిలిచారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు.
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆయన చేతులకే దాదాపు 50 ఇంజెక్షన్స్ చేశారని పంచ్ ప్రసాద్ సతీమణి తెలిపారు. ప్రస్తుతం కాస్త బాగానే ఉన్నా.. చికిత్స తర్వాత తీవ్రమైన నొప్పి ఉంటోందని వెల్లడించారు పంచ్ ప్రసాద్. ప్రస్తుతం నడవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య తెలిపారు.
ఇటీవలే తీవ్రమైన జ్వరం రావడంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు కమెడియన్. నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచ్ ప్రసాద్ అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment