ABHI
-
విదేశీ పర్యటనకు చిన్నారి.. 'అభి తుమనిషా'
కర్ణాటక: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉపన్యాస పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సంపాదించి మలేషియా పర్యటనకెళ్లడం సంతోషకరమని హోసూరు కార్పొరేషన్ విద్యాకమిటీ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. హోసూరు పారిశ్రామికవాడ జూజువాడి ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాలలో అభి తుమనిషా గత ఏడాది ప్లస్‌టూ చదువుతూ రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకొంది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళితో కలిసి మలేషియా పర్యటనకు తీసుకెళ్లారు. -
చైతన్య చివరి వీడియోపై కమెడియన్ అదిరే అభి..
-
'అమ్మోరు తల్లి' ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు 'అయాలీ'తో అలరిస్తోంది
చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమై.. తర్వాత హీరో, హీరోయిన్ అయిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో అభి నక్షత్ర పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘అయాలీ’ వెబ్ సిరీస్‌లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించింది. తమిళనాడులోని రాజపాలాయం గ్రామంలో పుట్టి పెరిగిన అభి నక్షత్ర .. అసలు పేరు అభినయ నక్షత్ర. ప్రశంసలు, అభిమాన గణం అభికి ఇప్పుడు కొత్తేం కాదు. స్కూల్లో ఉన్నప్పటి నుంచీ పరిచయమే. అమ్మాయి.. చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుకే. బడిలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటూ తన ప్రతిభతో అందరినీ మెప్పించేది. అందరి ప్రశంసలు అందుకునేది. అలా అనుకోకుండా ఒకరోజు సినిమా అవకాశం అభిని పలకరించింది. ఇక సినిమా అనగానే ఆమె సరదా పడటంతో తల్లిదండ్రులూ కాదనలేకపోయారు. చదువుపై నుంచి దృష్టి మళ్లకూడదని.. షూటింగ్ నుంచి తిరిగొచ్చాక అభినయని స్కూలుకు పంపేవారు. ఆమె మొదటి సినిమా ‘అమ్మోరు తల్లి’ విడుదల వరకు అభి స్నేహితులకు తను సినిమాల్లో నటించిందన్న విషయం తెలియదట. ‘అమ్మోరు తల్లి’(మూక్కుత్తి అమ్మన్) విజయం సాధించడం.. అందులోని తన అభినయ కళ అందరినీ ఆకట్టుకోవడంతో మరిన్ని సినిమా ఛాన్స్‌లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథాంశాలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నవరస’ అనే ఆంథాలజీలోనూ అభినయ నటించింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘అయాలి’ సిరీస్‌లో లీడ్ రోల్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. డాక్టర్ అవాలన్నది నా చిన్నప్పటి కల. కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా. సినిమాలు చేస్తూనే చదువు కూడా పూర్తి చేస్తా! – అభి నక్షత్ర. -
ఈ జబర్దస్త్‌కు ఏమైంది.. ఇలా తిట్టుకుంటున్నారు.. అదిరే అభి ఎమోషనల్
జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరినీ నవ్వించే బబర్దస్త్ కామెడీ షోకు దిష్టి తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరి దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని ఎమోషనల్ పోస్ట్ చేశారు. మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుండని అన్నారు. 'జబర్దస్త్ టీం అంతా సంతోషంగా ఉండేవాళ్లమని.. అంతా ఓ కుటుంబం లాగా ఉండేదని.. మాది జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. అలాంటి ఫ్యామిలీ లాంటి జబర్దస్త్‌కు ఎవరో దిష్టి పెట్టారంటూ' ఎమోషనల్ అయ్యారు. అందులో ఏముందంటే.. 'జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్‌తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టే కంటిస్టెంట్లు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఇవేమీ ఇప్పుడు కనిపించడం లేదని అభి రాసుకొచ్చారు. మళ్లీ పాత రోజులు వస్తే బాగుండునని తన వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. ఎవరైనా ఏదైనా అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా మంది కమెడియన్స్ ఈ షో నుంచి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే. అనసూయ, కిరాక్ ఆర్పీ వంటి వాళ్లు ఇప్పుడు షోలో లేరు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి తోడు.. మల్లెమాల యాజమాన్యం మీద ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శలు వంటివి నచ్చక ఇలా పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. -
‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభికి ప్రమాదం.. చేతికి 15 కుట్లు!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అదిరే అభి(అభినవ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారు. అభి ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు. ప్రస్తుతం అభి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల వరకు అభి విశ్రాంతి తీసుకోనున్నారు. (చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్) ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’తో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు అభి. ఆ తర్వాత కొన్నాళ్లు పలు రియాల్టీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఓ ప్రముఖ చానల్లో ప్రసారమయ్యే కామెడీ షోలో టీమ్ లీడర్‌గా చేసి, ఇటీవల బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో పాటు ఓ కామెడీ షో చేస్తున్నాడు. -
పది గంటల్లోనే సినిమా పూర్తి.. ఎమ్మెల్యే రోజా అభినందనలు
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. కథ బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమాయే. తమి ళంలో ‘స్వయంవరం’ సినిమాను 24 గంటల్లో పూర్తి చేశాం. పది గంటల్లోనే ‘వైట్ పేపర్’ను పూర్తి చేసిన టీమ్‌కి నా అభినందనలు. అభి హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అదిరే అభి, అభినయ కృష్ణవాణి, తల్లాడ సాయికృష్ణ, స్నేహ, నందకిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్ పేపర్’. శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను రోజా విడుదల చేశారు. ‘‘నాలుగు కెమెరాలతో ఈ సినిమాని షూట్ చేశాం. మా ప్రయత్నానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కనుంది’’ అన్నారు అభి. -
అన్నం తినే ప్లేటు మీద నుంచి లేపారు: అదిరే అభి
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు అభినయ కృష్ణ. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో అదిరే అభిగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. అదేంటో ఆయన మాటల్లోనే.. "ఆర్థికంగా ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడూ అప్పు కూడా చేయలేదు. షూటింగ్స్ లేకపోయినప్పటికీ జబర్దస్త్ నుంచి మాకు ఒక షెడ్యూల్‌కు డబ్బులు ఇచ్చారు. పైగా గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాను. అప్పుడే సొంతిల్లు కట్టుకున్నాను. ఒక కారు కూడా ఉంది. ఇక చదువుకునేటప్పుడు ఎస్టీడీ బూత్‌లో పని చేశాను. ట్యూషన్లు కూడా చెప్పేవాడిని. అలా హాస్టల్లో నా పాకెట్‌మనీ నేను సంపాదించుకునేవాడిని. అలా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చా.. 'ఈశ్వర్' సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్‌కు పిలిస్తే నలభై మంది వచ్చారు. అందులో నేను సెలక్ట్ అయ్యాను. డబ్బులు సంపాదించుకోడానికి అయితే సాఫ్ట్వేర్ జాబే చేయొచ్చు. కానీ నేను సినిమా కోసం వచ్చాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సంఘటన జరిగింది. షూటింగ్ మధ్యలో బ్రేక్ చెప్పారు. మేము లంచ్ బాక్స్‌లు తీసి తింటున్నాం. ఇంతలో ఫైట్ మాస్టర్ వచ్చి లంచ్ ఎవడు చేయమన్నాడు, షాట్ ఉంది, రండి అని పిలిచాడు. ఒక్కసారిగా షాకైన నేను తినేటప్పుడు మధ్యలో ఎలా వెళ్లను? అని ఓ క్షణం ఆలోచించాను. కానీ తప్పదు కాబట్టి తింటున్న ప్లేట్ పక్కన పెట్టి వెళ్లా. అన్నాన్ని అలా మధ్యలో వదిలేయడం కాస్త బాధ కలిగించింది. ఎవడు రానిచ్చాడు.. ఈమధ్య ఒక స్టూడియో మేనేజర్ కించపరుస్తూ మాట్లాడాడు. నేను ఇంకా పార్కింగ్‌లోనే ఉన్నాను. అప్పుడతను వచ్చి లోపలికి ఎవరిని అడిగి వచ్చారు, కారు బయట పెట్టండి? అంటూ రెచ్చిపోయాడు. ముందు ఇక్కడ నుంచి బండి తీయండి అని దురుసుగా మాట్లాడాడు. నేను మాత్రం అతడిని మీరు అని మర్యాదగా మాట్లాడాను. కొందరు ఇలానే ప్రవర్తిస్తారులే అని నేనే లైట్ తీసుకున్నా. ఇక కొందరుంటారు. అసలు జబర్దస్త్ చూడనే చూడము, అదేంటో తెలీదు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ తర్వాత మళ్లీ దాని గురించే మాట్లాడతారు. సుధీర్, రష్మీది నిజమేనా? అని కూపీ లాగుతుంటారు. అయితే హీరో వెంకటేష్ మాత్రం భలే కామెడీ చేస్తారయ్యా అంటూ మమ్మల్ని నిజంగా మెచ్చుకున్నాడు. చాలా మందికి తెలియని విషయమేంటంటే గతేడాది సెప్టెంబర్ 24న నేను అవయవదానానికి సంతకం చేశాను" అని చెప్పుకొచ్చాడు. చదవండి: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ -
పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్లు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమా వాళ్లకు సైబర్ కేటుగాళ్ల ముప్పు తప్పడం లేదు. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే వాటిని ఆన్లైన్లో లీక్ చేసి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్లైన్లో చక్కర్లు కొట్టగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాయింట్ బ్లాంక్' సినిమాను ఇలాగే లీకైంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన 'పాయింట్ బ్లాంక్'. సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుండగా.. ఇంతలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. విడుదలకు ముందే ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి తమ ఫిర్యాదు నమోదు చేశారు. ఎంతో కష్టపడి తీసిన తమకు తెలియకుండానే ఇలా ఆన్లైన్లో లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ ప్రింట్ ఆన్లైన్లో తీసేయాలని పోలీసులను కోరారు. -
బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం
ఇద్దరు బాలుర అపహరణకు యత్నం.. ఒక నిందితుడి పట్టివేత జడ్చర్ల: ఇద్దరు బాలురను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురు ముఠా సభ్యుల్లో ఒకరు పట్టుబడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. జడ్చర్ల పట్టణం ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న వడ్డె వెంకటేశ్, కవిత దంపతులకు మురళి (14), అభి (11) కుమారులు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం వెంకటేశ్ హత్యకు గురికాగా.. పిల్లలను సాకలేక ఆరేళ్ల క్రితం పరిచయం ఉన్న ఓ వ్యక్తికి కుమారుడు మురళిని తల్లి కవిత అప్పగించింది. దీంతో సదరు వ్యక్తి మురళిని కర్ణాటకకి తీసుకెళ్లి దొంగతనాలు చేయించేవాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు అభిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఐదేళ్ల క్రితం కిడ్నాప్ చేసి అన్న మురళి దగ్గరకు చేర్చారు. అక్కడ వీరితో పాటు మరో బాలుడు కలసి రోజూ దొంగతనాలు చేస్తూ ముఠాసభ్యులకు అప్పగించేవారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం బాలుర తల్లి కవిత అనారోగ్యంతో మృతి చెందింది. 20 రోజుల క్రితం ఎలాగోలా అన్నదమ్ములు ముఠా నుంచి తప్పించుకుని రైలులో జడ్చర్లకు వచ్చారు. అయితే ముఠాకు చెందిన వెంకటేశ్, చంటిలు పిల్లలను వెతుక్కుంటూ జడ్చర్లకు వచ్చారు. తమకు పరిచయం ఉన్న శరణప్పను మధ్యవర్తిగా పెట్టుకుని పిల్లలను అప్పగించాలని కోరారు. అలా చేస్తే రూ.40 వేలు ఇస్తామని చెప్పారు. ఈ విషయం పిల్లల చిన్నాన్న మల్లేశ్‌కు తెలియగా ఆయన స్థానికుల సహకారంతో వారిని పట్టుకునే ప్రయ త్నం చేయగా వెంకటేశ్, చంటి పారిపోగా శరణప్ప దొరికాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హింసించి దొంగతనాలు చేయించేవారు కర్ణాటక బీజాపూర్‌లో తమను తీవ్రంగా హింసిస్తూ దొంగతనాలు చేయించే వారని బాలురు మురళి, అభి పోలీసులకు వివరించారు. పట్టుబడిన శరణప్ప రాయిచూర్ జిల్లా మాన్వీ తాలుకా హీరే కొట్నెకల్కి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఇక పారిపోయిన వెంకటేశ్, చంటి రంగారెడ్డి జిల్లా శంకరపల్లికి చెందినవారుగా గుర్తించారు. -
హెల్త్ బాగుంటే ప్రీమియం వెనక్కి!
► 2 శాతం నుంచి 30 శాతం దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ► ఆరోగ్య విధానాల్ని పాటించటానికే ఈ ప్రోత్సాహం ► నాలుగేళ్లలో పది శాతం మార్కెట్ వాటాపై దృష్టి ► ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ బత్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా పాలసీలంటే ఎంతసేపూ అనారోగ్యం గురించి భయపెట్టేలానే ఉంటాయి. ఇలా కాదంటూ... ఆరోగ్య బీమాను పాజిటివ్ కోణంలో చూపించాలనుకుంటోంది కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్ఐ). ఆరోగ్యకరమైన జీవన విధానాల్ని పాటించే పాలసీదారులకు కొంత ప్రీమియం తిరిగిచ్చేలా పాలసీలు రూపొందించింది. వాటి ప్రత్యేకతలు, కంపెనీ ప్రణాళికలను సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు సంస్థ సీఈవో మయాంక్ బత్వాల్. ఆ వివరాలు సంక్షిప్తంగా .. ఇప్పటికే పలు స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. కొత్తగా మీరు ఏం సాధించగలమనుకుంటున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్‌లో ముందు హెల్త్ (ఆరోగ్యం).. తర్వాతే ఇన్సూరెన్స్ (బీమా). ఇదే కాన్సెప్ట్‌పై మేం దృష్టి పెడుతున్నాం. ప్రస్తుతం పాలసీలు విక్రయించే కంపెనీలు... మీకేమైనా అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైపోతాయి.. ఇబ్బందుల పాలైపోతారు కాబట్టి మా పాలసీ తీసుకోండి అంటున్నాయి. సాధారణంగా కస్టమర్లు ఇలాంటి నెగటివ్ ప్రతిపాదనలు వినటానికి ఇష్టపడరు. అందుకే మేం దానికి పూర్తి భిన్నంగా కస్టమర్లలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించేలా మా యాక్టివ్ హెల్త్ పాలసీని రూపొందించాం. ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటిస్తే.. దానికి ప్రతిఫలంగా ప్రీమియంలో కొంత మొత్తం వాపస్ చేస్తామనే ప్రతిపాదన తెచ్చాం. అటుపైన ఏదైనా జరిగితే బీమా కవరేజీ ఎలాగూ ఉంటుంది. ఈ ప్రతిపాదన ఇటు కంపెనీకి, అటు పాలసీదారుకు కూడా మంచిదే. పాలసీదారు ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. దీంతో కట్టిన ప్రీమియంలో కొంత తిరిగి వస్తుంది. అది పాలసీదారుకు రెండు రకాలుగా లాభం. పాలసీదారు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువ కావడం వల్ల.. క్లెయిమ్‌లు కూడా తక్కువుంటాయి. మాకు లాభం. ప్రీమియంల క్యాష్‌బ్యాక్‌కి సంబంధించి పాలసీదారు జీవన విధానాన్ని ఎలా ట్రాక్ చేస్తారు? ప్రస్తుతం ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. పాలసీదారు తన ఫోన్లో సదరు యాప్‌ను, మా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండింటినీ అనుసంధానించాలి. అక్కణ్నుంచి నడక, వ్యాయామం మొదలైన వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఏరోజుకారోజు మా యాప్ ట్రాక్ చేస్తుంది. ఉదాహరణకు ఇవాళ ఎన్ని అడుగులు వేశారు (వాకింగ్), ఎంత సేపు జిమ్ చేశారు, కరిగిన కేలరీలు మొదలైన వివరాలన్నీ రికార్డవుతాయి. తదనుగుణంగా స్కోరింగ్, హెల్త్రిటర్న్స్ పేరిట రివార్డులుంటాయి. యాప్ ద్వారా లెక్కించేందుకు వీలు కాని యోగా వంటివి చేస్తున్న పక్షంలో మా వైద్య నిపుణులు ఫిట్నెస్ పరీక్ష సేవలు, తగు సూచనలు అందించేందుకు అందుబాటులో ఉంటారు. ఇలా మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించేవారికి ... కట్టిన ప్రీమియంలో రెండున్నర శాతం నుంచి గరిష్టంగా 30 % దాకా రిటర్న్ ఇస్తాం. ఈ మొత్తాన్ని తదుపరి ప్రీమియం కట్టేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇతర సంస్థల నుంచి పోటీ ఎలా ఉంది? సుమారు ఇరవై కోట్ల మందికి ఆరోగ్య బీమా ఉంది. కానీ అది ప్రభుత్వ పథకాలు లేదా కార్పొరేట్ గ్రూప్ పాలసీల రూపంలోనే ఉంటోంది. వ్యక్తిగత హెల్త్ పాలసీల సంఖ్య 3 కోట్ల స్థాయిలోనే ఉంది. మరోవైపు వైద్య చికిత్స వ్యయాలు 12–14 శాతం మేర పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ పాలసీలపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం దాదాపు రూ. 27,000 కోట్లుగా ఉన్న దేశీ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుంది. మేం కార్పొరేట్ పాలసీలతో పాటు యాక్టివ్ హెల్త్ పేరిట రిటైల్ పాలసీ అందిస్తున్నాం. ఇందులోనే ప్రాథమికమైన, తీవ్రమైన అనారోగ్యాలు మొదలైన వాటికి వేర్వేరు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. డయాబెటిస్, బీపీ, ఆస్తమా వంటి నాలుగు క్రానిక్ డిసీజెస్ చికిత్సకు ఉచిత అప్‌గ్రెడేషన్ ఫీచర్ అందిస్తున్నాం. ఇప్పటికే ఇవి ఉన్నవారు గానీ పాలసీ తీసుకున్నా కూడా తొలి రోజు నుంచే కవరేజీ అందిస్తున్నాం. రిటైల్‌కి సంబంధించి ప్రోడక్టు ప్రస్తుతం ఒకటే అయినప్పటికీ .. సమగ్రంగా అన్నీ అందిస్తున్నాం. పోటీ అంటారా!! ఎన్ని సంస్థలు వచ్చినా ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది. అంతిమంగా వినియోగదారులకు మంచిదే. వ్యాపార ప్రణాళికలేంటి? ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో సుమారు 150 నగరాల్లో 1600 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. రెండువేలకు పైగా ఏజెంట్లున్నారు. ఏజేంట్లు, బ్యాంకులు, ఆన్లైన్ మొదలైన అన్ని మాధ్యమాల ద్వారా మా పాలసీల్ని విక్రయిస్తున్నాం. ప్రస్తుతం బ్యాంకెష్యూరెన్స్కి సంబంధించి కొన్ని బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో శాఖలున్నాయి. రాబోయే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో 100 నగరాల్లో ఏజెన్సీలను విస్తరిస్తాం. రాబోయే నాలుగేళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో కనీసం 8–10 శాతం వాటాను దక్కించుకోవాలని లకిష్యస్తున్నాం. ఒకే బ్యాంకు దాదాపు మూడు బీమా సంస్థల పాలసీలు విక్రయించేందుకు అనుమతులుండటం కలిసొచ్చే అంశం. దీనివల్ల పోటీ ఎలా ఉన్నా.. మరింత మందికి చేరువ అయ్యే వీలు దక్కుతుంది. పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్.. ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్లే’లో ఇట్జ్‌క్యాష్ పెట్టుబడులు ముంబై: దేశీ ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ రంగ సంస్థ ‘ఇట్జ్‌క్యాష్’ తాజాగా బెంగళూరుకు చెందిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్లే’లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లను చేసింది. దీంతో తమ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కార్యకలాపాలు మరింత పటిష్టంగా తయారవుతాయని ఇట్జ్‌క్యాష్ పేర్కొంది. కంపెనీలకు సంబంధించిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ మార్కెట్లో 25 బిలియన్ డాలర్లమేర వృద్ధి అవకాశాలున్నాయని ఇట్జ్‌క్యాష్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ భవికా వాసా తెలిపారు. ఫిన్లే స్టార్టప్ కంపెనీల కోసం ఒక ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ టూల్‌ను తయారు చేసిందన్నారు. రూ.24 లక్షల కోట్లకు ఆస్తుల విలువ: ఎల్ఐసీ ముంబై: బీమా రంగ దిగ్గజం– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రీమియం తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి తొమ్మిది నెలల ఆడిట్ గణాంకాలను ప్రకటించింది. వీటి ప్రకారం సంస్థ మొత్తం ప్రీమియం ఆదాయం 12.43 శాతం వృద్ధితో రూ.1.29 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఎల్ఐసీ మొత్తం ఆస్తుల విలువ కూడా 12.81 శాతం వృద్ధితో రూ.21.6 లక్షల కోట్ల నుంచి రూ.24.4 లక్షల కోట్లకు ఎగసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది ఏజెంట్లను నియమించుకుంది. ఆర్థిక అక్షరాస్యతకు ఉజ్జీవన్ బ్యాంక్ షార్ట్‌ఫిల్మ్ ముంబై: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ (ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ) తాజాగా వినియోగదారుల్లో ఆర్థిక అక్షరాస్యత తీసుకురావడం కోసం ఒక ఎడ్యుకేషనల్ షార్ట్‌ఫిల్మ్ ‘పైసన్ కి ఏబీసీడీ’ని నిర్మించింది. ఇది పరిణామ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమాను తీసింది. ప్రదీప్ సర్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ద్వారా వినియోగదారుల్లో బ్యాంకింగ్‌పై ఉన్న అపోహలను తొలగించి, బ్యాంక్ ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేస్తామని ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ పేర్కొంది.