
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అదిరే అభి(అభినవ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారు. అభి ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్‌ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు. ప్రస్తుతం అభి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల వరకు అభి విశ్రాంతి తీసుకోనున్నారు.
(చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్)
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’తో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు అభి. ఆ తర్వాత కొన్నాళ్లు పలు రియాల్టీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే కామెడీ షోలో టీమ్ లీడర్‌గా చేసి, ఇటీవల బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో పాటు ఓ కామెడీ షో చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment