
అభివృద్ధి, సంక్షేమంపై శ్వేతపత్రం
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నట్లు నిజంగా ఆయన పాలనలో అభివృద్ధి సంక్షేమం జరిగి ఉంటే ఆ వాస్తవాలతో పూర్తి గణాంకాలతో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
సర్కారుకు బాలినేని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నట్లు నిజంగా ఆయన పాలనలో అభివృద్ధి సంక్షేమం జరిగి ఉంటే ఆ వాస్తవాలతో పూర్తి గణాంకాలతో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఒక పత్రికా సంస్థ ఇచ్చిన అవార్డును సాకుగా చూపి కీలకమైన సంక్షేమ, అభివృద్ధి రంగాలలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉన్నదంటూ ముఖ్యమంత్రి ఫోటోలతో కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విజయవంతమైన చాలా పథకాలు నేడు నామమాత్రంగా మారిపోయాయని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కుంటుపడ్డాయని పేర్కొన్నారు.
వైఎస్ పాలనలో బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం ధర రూ. 20 ఉండగా, ఇప్పుడు అదే బియ్యం ధర రూ.50 దాటిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయని, ఆరోగ్యశ్రీ నుంచి 200 జబ్బులను తొలగించారని దుయ్యబట్టారు. డాక్టర్లు, నిపుణుల కొరత ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 133 జబ్బులకు చికిత్స చేయించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించడం దుర్మార్గమైన విషయమని పేర్కొన్నారు.
బెంగళూరు మీదుగా వెళ్లేందుకు జగన్‌కు అనుమతి
సమైక్య శంఖారావం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు మీదుగా ఈనెల 27న చిత్తూరు జిల్లాకు వెళ్లేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్‌చార్జి న్యాయమూర్తి సాయి కల్యాణ్ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.