
'ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకూ జవాబిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మూడు శ్వేతపత్రాలపై అసెంబ్లీలో చర్చిస్తామని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ శనివారం హైదరాబాద్లో భేటీ అయింది. భేటీ అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని పేర్కొన్నారు. ఇసుక, కల్తీ మద్యం, బాక్సైట్ తవ్వకాలు అంశాలపై సభలో చర్చిస్తామని యనమల వివరించారు.