
'చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ అవాస్తవాలే'
చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ అవాస్తవాలేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
హైదరాబాద్: చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ అవాస్తవాలేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ దివాళ తీసిదంటూ... చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. జలయజ్ఞంలో అవినీతి జరిగితే విచారణ జరపాలని అన్నారు.
ఇంజినీరింగ్ అడ్మిషన్లు, స్థానికత, శాంతిభద్రతల అంశం, ఉద్యోగుల విభజన, ఫీజురీయింబర్స్మెంట్ విషయాల్లో టీడీపీ, టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకోసం పాకులాడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఈ వ్యవహారాలన్నీ విభజన బిల్లు ప్రకారమే జరగాలని, వివాదాలు తలెత్తితే కేంద్రం పరిష్కరించాలని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.