ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి | The white paper should be released on vacant jobs | Sakshi
Sakshi News home page

ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Published Sat, Aug 19 2017 4:20 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షణీయమని, కానీ ప్రకటించిన ఖాళీల్లో స్పష్టత లేదని శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను పేర్కొంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భర్తీ చేసిన పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా స్పష్టం చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement