R. Krishnaiah demand
-
108 ఉద్యోగులను తొలగిస్తే ఊరుకోం: కృష్ణయ్య
హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేదిలేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. 15 రోజులుగా ప్రజాస్వామ్యయుతంగా ఆం దోళన చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని జీవీకే సంస్థ బెదిరించడం అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. వెంటనే వారిని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన 108 ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 108 ఉద్యోగుల్లో 95%ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి నాలుగేళ్లు దాటినా దాని ఊసేలేదన్నారు. -
బీసీ హాస్టళ్లకూ నిధులివ్వండి
ఆర్. కృష్ణయ్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రెడ్డి హాస్టల్‌కు రూ.10 కోట్లతో పాటు పదె కరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, పేదలు, వెనుక బడిన వర్గాలు చదువుకుంటున్న బీసీ గురుకులాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఒక్కో వసతిగృహం, గురుకులానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయిం చడంతో పాటు శాశ్వత భవనాలు నిర్మించేందుకు భూములు ఇవ్వాలని కోరుతూ సోమవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో అరకొర సౌకర్యాలతో నడుస్తున్నా యని.. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. -
ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షణీయమని, కానీ ప్రకటించిన ఖాళీల్లో స్పష్టత లేదని శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను పేర్కొంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భర్తీ చేసిన పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా స్పష్టం చేయాలని తెలిపారు.