
హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేదిలేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. 15 రోజులుగా ప్రజాస్వామ్యయుతంగా ఆం దోళన చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని జీవీకే సంస్థ బెదిరించడం అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. వెంటనే వారిని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన 108 ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 108 ఉద్యోగుల్లో 95%ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి నాలుగేళ్లు దాటినా దాని ఊసేలేదన్నారు.