ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు | Andhra Pradesh CM N Chandrababu Naidu will be release white paper on Human resource department | Sakshi
Sakshi News home page

ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు

Published Thu, Jul 31 2014 12:10 PM | Last Updated on Sat, Jun 2 2018 4:51 PM

ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు - Sakshi

ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై శ్వేతపత్రాల విడుదల పరంపర కొనసాగుతోంది. తాజాగా మానవ వనరుల శాఖపై శ్వేతపత్రాన్ని గురువారం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ఆ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు వారానికి ఓ శాఖ చొప్పున విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటి పారుదల రంగంపై శ్వేతప్రతం విడుదల  చేసిన సంగతి తెలిసిందే.

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా చంద్రబాబు ఈ రోజు సమావేశమైయ్యారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్, విప్లతో బాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత అవినీతి నిర్మూలనపై మంత్రి వర్గ ఉపసంఘంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.00 గంటలకు పలువురు ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement