సాక్షి,హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలును ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో దగా చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేత పత్రం మీద జరిగిన స్వల్పకాలిక చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారన్నారు.దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు బదులిచ్చారు.
శ్వేతపత్రంలో కేవలం అప్పులు చూపించి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల రుణ భారం అదనంగా పడిందని చెప్పారు. దేశ జీడిపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 స్టేట్స్‌లో తెలంగాణ ఒకటన్నారు.తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment