
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ప్రజలు పండగలు కూడా చేసుకోలేకపోయారని..వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా దసరా పండగను చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎన్ని దుష్ఫ్రచారాలు చేసిన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
పెట్టుబడుల సదస్సుల పేరిట చంద్రబాబు సర్కారు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ఇతర రాష్ట్ర్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు పక్కి దివాకర్, రామన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment