
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించే అవినీతి రహిత పాలనకు అందరూ సహకరించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ. 1150 కోట్ల నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఐదేళ్ల పాలనతో చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను కష్టాల పాలు చేశారని మండి పడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం జనగ్ తీసుకునే నిర్ణయాల పట్ల రాజకీయ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయ పాలన ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలను జనగ్‌మోహన్‌రెడ్డి నిజం చేశారని ప్రసాద్ రెడ్డి ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment