సమష్టి కృషితో.. | Praja Sankalpa Yatra Success is with Collective effort | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితో..

Published Thu, Jan 10 2019 4:03 AM | Last Updated on Thu, Jan 10 2019 7:48 AM

Praja Sankalpa Yatra Success is with Collective effort - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మనం ఏదైనా చిన్న కార్యక్రమం తలపెడితే ఎన్నో ప్రణాళికలు, మరెన్నో ఉప ప్రణాళికలు, ఇంకెన్నో సర్దుబాట్లు.. మార్పులు, చేర్పులు చేస్తూ అవసరమైన వారందరినీ కలుపుకుంటూ అనుకున్న లక్ష్యం సాధిస్తాం. అటువంటిది ఓ మహాయజ్ఞం విజయవంతం వెనుక ఎంతమంది శ్రమ, మరెంతమంది సహాయ సహకారాలు ఉంటాయో ఊహించలేం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 341 రోజులపాటు నిర్విఘ్నంగా, నిరాటకంగా అప్రతిహతంగా కొనసాగడం వెనుక పట్టుదల, అకుంఠిత దీక్ష, సమిష్టి కృషి, సమయస్ఫూర్తి కనిపిస్తుంది. మహాభారతంలో కౌరవుల దుష్టపాలనను అంతంచేసేందుకు బయల్దేరిన పాండవులకు ప్రతిఒక్కరూ ఒక్కో అస్త్రమై ఏ విధంగా సహకరించారో చంద్రబాబు అవినీతి పాలనపై దండెత్తిన జగన్‌కు ఆ విధంగా పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు అంతగా సహకరించారు.

రూట్‌ మ్యాప్‌ ఖరారు మొదలు జగన్‌ బస, సభ నిర్వహణ వరకు ప్రతి ఒక్కటీ పక్కా ప్రణాళికతో విజయవంతమయ్యాయి. చలి గజగజ వణికిస్తున్నా.. జడి వాన కురుస్తున్నా.. మాడు పగిలిపోయేలా ఎండలు కాస్తున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న తమ నేత జగన్‌కు అండదండలు అందించారు. జగన్‌ ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు నడవాలో, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్లాలో రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసిన వారు ఒకరైతే ఆయన బస ఏర్పాటుచూసే వారు మరొకరు. అన్నపానీయాలు, ఆరోగ్య సూచనలు, సలహాలు, వ్యాయామం, శిబిరంలో సమీక్షలు, మర్నాటి ప్రణాళికలు, బహిరంగ సభా వేదికల ఖరారు, ప్రసంగాలు.. ఇలా ఎన్నెన్నో వ్యవహారాలను చక్కబెట్టడంలో పార్టీ నేతలు కృతకృత్యులయ్యారు. వీరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, వ్యక్తిగత సహాయకులు కే నాగేశ్వర్‌రెడ్డి, రవి, పార్టీ ఇతర నేతలు అర్జున్, డాక్టర్‌ హరికృష్ణ, రఘునాథరెడ్డి, వైద్య సహాయకులు డాక్టర్‌ శ్రీనివాస్, డాక్టర్‌ గురుమూర్తి, ట్రాన్స్‌పోర్టు బాధ్యుడు జనార్ధన్‌.. ఇలా ఎందరెందరో ఉన్నారు. తమ నాయకుడు ఎక్కడుంటే ఆయనతో పాటు అడుగులో అడుగువేస్తూ ఉండే శ్రేణులు సైతం జగన్‌ శిబిరం పక్కనే ఉండేవారు. వీరికీ ఎలాంటి లోటు రాకుండా చూశారు. 

ప్రతీరోజూ రెండు టెంట్లు.. 
రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసిన తర్వాత వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం, రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు వేసే బాధ్యతను ఒకరు చేపడితే.. సభా వేదికల ఖరారును రఘునాథరెడ్డి బృందం చేపట్టేది. నిత్యం రెండు గుడారాలను వేయవలసి ఉండేది. మొత్తం మూడు టెంట్లు ఉంటే రెండు ప్రతిరోజూ వేసి ఉంటాయి. మరొకటి రవాణాలో ఉండేది. పాదయాత్ర సాగే మార్గంలోనే జనప్రవాహాన్ని దాటుకుంటూ వీటిని ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం తలకు మించిన పని అయినా ఆ బాధ్యత చేపట్టిన వారు ఎంతో చాకచక్యంతో సమయస్ఫూర్తితో తరలించేవారు. బస కోసం ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేయడం మొదలు టెంట్‌ వేసే వరకు అన్ని పనులను దగ్గరుండి పార్టీ శ్రేణులు చూసుకునే వారు.  మధ్యాహ్నం వేసిన టెంట్‌ను మరుసటి రోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి చేర్చేవారు. రాత్రి వేసిన టెంట్‌ను పొద్దున జగన్‌ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత తీసివేసి ఆ మరుసటి రోజు రాత్రి ఎక్కడ బసచేస్తారో అక్కడికి తరలించే వారు. 

పక్కా ప్రణాళిక.. 
ఎక్కడ, ఏమిటీ అనేది ఒకసారి ఖరారైన తర్వాత ఎవరు, ఎలా అనేది ముందురోజే ఖరారయ్యేది. ఇందుకోసం ఆయా బాధ్యతలు చేపట్టిన వారు ఆయా ప్రాంతాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఇతర నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు సాగుతుండేవారు. దీంతోపాటు పాదయాత్రలో పాల్గొనే ప్రజలకు సైతం మధ్యాహ్న భోజన సదుపాయం ఉండేది. పాదయాత్రలో వచ్చే వినతులను, ఆరోగ్య సంబంధిత సమస్యలను డాక్టర్‌ హరికృష్ణ పర్యవేక్షించేవారు. ప్రతి ఫిర్యాదును కే నాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ హరికృష్ణల ద్వారా కృష్ణమోహన్‌కు అందితే ఆయన కంప్యూటర్లలో నిక్షిప్తం చేయించే వారు. డాక్టర్‌ శ్రీనివాస్, డాక్టర్‌ గురుమూర్తి వంటి వారు జగన్‌ ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టేవారు.

ఎందరో సారథులు.. 
రూట్‌మ్యాప్‌ ఖరారు మొదలు బహిరంగ సభల ఏర్పాటు వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బృందం చూసేవారు. రూట్‌ పరిశీలన వంటి వాటిని అర్జున్‌ పర్యవేక్షించే వారు. జగన్‌ వ్యక్తిగత భద్రత, రవాణా, గుడారాల ఏర్పాటు వంటి పనులను రఘునాథరెడ్డి, జనార్ధన్‌ పర్యవేక్షించే వారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకునే వారు కె.నాగేశ్వర్‌రెడ్డి. జగన్‌కు అవసరమైన సమాచారాన్నీ, వ్యక్తిగత వ్యవహారాలను, ముఖ్య విషయాల్లో అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంవంటి అంశాలను ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి నిర్వర్తించేవారు. పాదయాత్రలో జగన్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యక్తిగత సహాయకునిగా రవి వ్యవహరించే వారు.

జాతీయ మీడియాతో..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement