
‘తిత్లీ తుఫాన్ మా ప్రాంతాన్ని నాశనం చేసింది. జీడి మామిడి, కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు’ అని వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన మడ్డు పరమేశ్వరి రాజన్న బిడ్డతో చెప్పారు. ప్రభుత్వం 50 శాతం మందికి నష్ట పరిహారం ఇవ్వడం లేదని అన్నారు. ఎకరాకు నష్టపరిహారం రూ.10 వేలు మాత్రమే అందజేశారని చెప్పారు.