PM Modi WhatsApp Channelప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మరోసారి తన హవాను చాటుకున్నారు. తాజాగా వాట్సాప్ చానెల్‌లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటేసి మరో రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్) ఫేస్‌బుక్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు. తాజాగా వాట్సాప్ ఛానెల్‌లో మరో కీలక మైలురాయిని సాధించడం విశేషం
91 మిలియన్ల మంది ఫాలోవర్లతో Xలో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్స్‌లో టాప్ ప్రధాని మోదీ. కాగా, ఫేస్‌బుక్‌లో, పీఎం మదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. వాట్సాప్ చానెల్‌లో చేరడం ఆనందంగా ఉంది అంటూ కొత్త పార్లమెంటు భవనం ఫోటోను పోస్ట్ చేశారు మోదీ. సెప్టెంబర్ 13న భారతదేశంతో పాటు, 150కి పైగా దేశాలలో WhatsApp ఛానెల్స్‌ను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment