
ఎంఎస్ ధోని, చెన్నై ఆటగాళ్లు
పుణే : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 150 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ధోని ఈ రికార్డు నమోదు చేశాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో పరాజయం పొందింది.
2008 సీజన్ నుంచి చెన్నైకి సారథ్యం వహిస్తున్న ధోని.. తన కెప్టెన్సీలో చెన్నై జట్టును రెండు సార్లు చాంపియన్‌గా.. 4 సార్లు రన్నరప్‌గా నిలిపాడు. అంతేకాకుండా రెండు సార్లు చాంపియన్స్‌లీగ్ టైటిల్ అందించాడు. ప్రస్తుత సీజన్‌లో సైతం టైటిల్ దిశగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కీలక సమయాల్లో మ్యాచ్ ఫినిషర్ బాధ్యతలు తీసుకొని విజయాన్నందిస్తున్నాడు. దీంతో చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment