చెన్నై : అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్న కవి వర్ణన నటి అనుష్కకు చక్కగా సరిపోతుంది. దక్షిణాది వెండితెరపై వెలిగిపోతున్న హీరోయిన్ అనుష్క. ఒక్క ఓర చూపుతోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టగల ఈ నగుమోము సుందరి ఇతర నటీమణులు కాజల్, సమంత, ఇలియానలతో పోటీ పడినా ప్రస్తుతం తనదే పై చేయి అనిపించుకుంటున్నారు. అయితే వాళ్లంతా బాలీవుడ్‌లో పాగా కోసం తహతహలాడుతున్నారు. ఒకటి, రెండు చిత్రాల్లో నటించిన సరైనా గుర్తింపు రాకపోవడంతో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే నటి అనుష్కకు మాత్రం బాలీవుడ్ మోహం లేదట. ప్రస్తుతం తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అనుష్క హిందీ చిత్రాలకు కాల్‌షీట్స్ కేటాయించే పరిస్థితి లేదు. 2015 వరకూ ఈ భామ షెడ్యూల్ బిజీ. అనుష్క తమిళంలో నటించిన ఇరండాం ఉలగం ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న అనుష్క హిందీ చిత్రాల్లో నటించి తీరాలన్న ఆలోచన గాని, ఆసక్తి గాని తనకు లేదంటున్నారు. అన్ని కొలిసొచ్చి మంచి కథ, పాత్ర అయితే హిందీలో నటించే విషయం గురించి ఆలోచిస్తానని అనుష్క అంటున్నారు.
బాలీవుడ్డా?
Published Sun, Nov 17 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement