
ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి దాటింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలన్ మస్క్ వెల్లడించారు.దీనికి సంబంధించి తాజాగా టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో షిప్ 25 సిక్స్ ఇంజిన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ పూర్తి చేసుకున్నదని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు.
గత ఏప్రిల్‌లో ఎలన్ మస్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం విదితమే. అమెరికాలోని టెక్సాస్ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది.ఈ రాకెట్ ప్రయోగం విఫలమమైన నేపధ్యంలో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ వివరించింది.
గత ప్రయోగ ఫలితాలను విశ్లేషించి..
అయితే నాడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్‌లో ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్‌షిప్ ప్రయోగాన్ని గత ఏప్రిల్ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి, మెక్సికోలో పడేలా దానిని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించినా, సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో ప్రయోగం వాయిదా పడింది. తరువాతి ప్రయోగంలో ఊహించని విధంగా స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Key milestone completed for flight 2 https://t.co/bGmWKOnKEH
— Elon Musk (@elonmusk) June 27, 2023
ఇది కూడా చదవండి: ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు..
Comments
Please login to add a commentAdd a comment