ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్‌ బాధ పడుతున్నాడు! | Elon Musk Texas Mexico Border Visit | Sakshi
Sakshi News home page

అందుకే మస్క్‌ బాధ పడుతున్నాడు!

Published Sun, Oct 1 2023 7:19 AM | Last Updated on Sun, Oct 1 2023 10:38 AM

Elon Musk Texas Mexico Border Visit - Sakshi

అమెరికాలో అక్రమ సరిహద్దు క్రాసింగ్‌కు సంబంధించిన సంక్షోభం మధ్య బిలియనీర్ ఎలాన్ మస్క్ టెక్సాస్-మెక్సికో సరిహద్దులను పరిశీలించారు. ‘ఈగిల్‌ పాస్‌  సరిహద్దు దగ్గర ఏమి జరుగుతున్నదో చూడటానికి వెళ్లాను’ అని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. 

అక్కడి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఎలాన్‌ మస్క్‌ ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. బ్లాక్‌ కౌబాయ్ టోపీ ధరించిన మస్క్  అక్కడి అధికారులతో మాట్లాడారు. సరిహద్దులను పరిశీలించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో మస్క్  ఇటువంటి అక్రమ సరిహద్దు క్రాసింగ్‌లకు సంబంధించిన సమస్యలపై తన అభిప్రాయాలను తరచూ షేర్‌ చేస్తుంటారు. 

దీనికి ముందు టెక్సాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎస్ ప్రతినిధి టోనీ గొంజాలెస్‌తో మస్క్ మాట్లాడారు. అక్రమ వలసలు పెరిగిపోయాయని మస్క్‌ అనగా, కష్టపడి పనిచేసేవారు, నిజాయితీపరులు అమెరికాకు రావడానికి చట్టబద్ధంగా అనుమతి ఉందని టోనీ గొంజాలెస్‌ తెలిపారు. సరిహద్దు సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నదని మస్క్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో వెనిజులా మహిళ ఒకరు చిన్న పిల్లను తీసుకుని, అత్యంత జాగ్రత్తగా ముళ్లకంచెను దాటుకుని మెక్సికో సరిహద్దులను దాటి, అమెరికాలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. 
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement