
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. అదే తరహాలో కొత్త గరిష్టాల ట్రెండ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నిఫ్టీ తొలిసారి 11వేల మార్క్‌ను తాకడం ఇవాల్టి విశేషం. అలాగే సెన్సెక్స్ 36వేల మార్క్‌కు చాలా దగ్గరగా వచ్చేసింది. సెన్సెక్స్ 177 పాయింట్లు ఎగిసి 35,975 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11010 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్, ఆర్‌ఐఎల్, వేదాంతా, హిందాల్కో, ఇన్ఫోసిస్, యాక్సిస్, యస్‌బ్యాంక్, ఐబీ హౌసింగ్, టాటా స్టీల్ లాభపడుతుండగా మీడియా షేర్లు నష్టపోతున్నాయి. వీటితోపాటు గెయిల్, ఏషియన్ పెయింట్స్, అంబుజా, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ నెగిటివ్‌గా ఉన్నాయి.