iPhone New Features: Apple To Let iPhones Accept Credit Cards Without Extra Hardware - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌లో మరో అదిరిపోయే ఫీచర్..!

Published Thu, Jan 27 2022 10:13 AM | Last Updated on Thu, Jan 27 2022 11:45 AM

Apple to Let iPhones Accept Credit Cards Without Extra Hardware - Sakshi

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో కొత్త సేవను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొనిరావలని యోచిస్తుంది. చిన్న వ్యాపారాలు ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ లేకుండా తమ ఐఫోన్‌లలో నేరుగా క్రెడిట్ కార్డు చెల్లింపులను స్వీకరించడానికి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందిస్తుంది. బ్లూమ్ బెర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం రిటైలర్స్‌ డబ్బును స్వీకరించడానికి బ్లూటూత్ ద్వారా అనుసంధానించిన ఐఫోన్‌లలో బ్లాక్ ఇంక్ స్క్వేర్ చెల్లింపు వ్యవస్థలును ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ ఐఫోన్‌ను చెల్లింపు టెర్మినల్'గా మారుస్తుంది. 

వ్యాపారులు క్రెడిట్ కార్డు లేదా మరొక ఐఫోన్ సహాయంతో చెల్లించే చెల్లింపులను స్వీకరించడానికి ఈ కొత్త ఫీచర్ అనుమతిస్తుంది అని బ్లూమ్ బెర్గ్ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ కోసం ప్రస్తుతం యాపిల్ పే కోసం వినియోగించే ఎన్‌ఎఫ్‌సీ చిప్‌ను ఉపయోగిస్తుందని, రాబోయే కొద్ది నెలల్లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ బయటకు రావచ్చని నివేదిక తెలిపింది. కంపెనీ సుమారు 2020 నుంచి ఈ కొత్త కొత్త ఫీచర్​పై పనిచేస్తోంది. అయితే, బ్లూమ్ బెర్గ్ నివేదికపై వ్యాఖ్యానించడానికి యాపిల్ నిరాకరించింది. నివేదిక ప్రకారం, ఈ చెల్లింపు కోసం యాపిల్ పేలో భాగంగా బ్రాండ్ చేస్తారా లేదా ఇప్పటికే ఉన్న చెల్లింపు నెట్ వర్క్ తో భాగస్వామ్యం వహించాలని కంపెనీ యోచిస్తోందా లేదా ఒంటరిగా ప్రారంభించాలా అనేది అస్పష్టంగా ఉంది.

(చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్‌ ఇండియా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement