
ముంబై: విమానయాన సంస్థ ఇండిగో, ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇండిగో, ఇతర వ్యాపార సంస్థలకు ఈ కార్డుతో చెల్లింపులు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ అందుకోవచ్చు. వాటిని ఉపయోగించి కాంప్లిమెంటరీ ఎయిర్ టికెట్స్, డిస్కౌంట్స్, చెక్–ఇన్ ప్రాధాన్యత, సీట్ ఎంపిక, కాంప్లిమెంటరీ మీల్ వంటి ప్రయోజనాలు పొందవచ్చని ఇండిగో తెలిపింది. ఇండిగో విమాన టికెట్లను కొనుగోలు చేసేందుకూ ఈ పాయింట్లను వాడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment