
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించనున్నట్లు సీఎస్‌బీ బ్యాంక్ ఎండీ (తాత్కాలిక) ప్రళయ్ మండల్ వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన టెక్నాలజీని పటిష్టపర్చుకుంటున్నట్లు చెప్పారు. క్రెడిట్ కార్డులతో పాటు ఇతరత్రా ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.
2028–29 నాటికి రిటైల్ విభాగం మొత్తం వ్యాపారంలో అతి పెద్దదిగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మండల్ తెలిపారు. బంగారం రుణాల వృద్ధి నిలకడగా కొనసాగుతోందని, చిన్న..మధ్య స్థాయి సంస్థలకు లోన్‌లు పుంజుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మొండిబాకీలు తగ్గడంతో తొలి త్రైమాసికంలో సీఎస్‌బీ బ్యాంక్ నికర లాభం 88 శాతం పెరిగి రూ. 115 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment