
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య గమనిక. జనవరి నెల ప్రారంభం నుంచి క్రెడిట్ కార్డులపై అందించే రివార్డ్ పాయింట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది.
ఎస్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం.. గతంలో అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌పై 10ఎక్స్ రివార్డ్స్ పాయింట్స్‌పై పొందే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో సింప్లీ క్లిక్, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్స్‌తో ఇప్పుడు 5 రివార్డ్స్ పాయింట్లు మాత్రమే పొందే అవకాశం లభించింది.
పైగా ఇతర ఏ ఆఫర్లతోనూ గానీ, వోచర్లతో గానీ కలిపి వినియోగించడానికి వీల్లేదని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జనవరి 6 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుందని తెలిపింది.
ఇక అపోలో 24/7, బుక్ మై షో, క్లియర్, ఈజీ డైనీర్, లెన్స్ కార్ట్ అండ్ నెట్ మెడ్స్ వంటి ట్రాన్సాక్షన్‌లపై 10 రివార్డ్స్ పాయింట్లు పొందే అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment