క్రెడిట్‌ కార్డుల స్కాం.. రూ.23.8 కోట్ల మోసం | Indo americans arrested in credit cards scam | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డుల స్కాం.. రూ.23.8 కోట్ల మోసం

Published Fri, Mar 10 2017 10:09 PM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

క్రెడిట్‌ కార్డుల స్కాం.. రూ.23.8 కోట్ల మోసం - Sakshi

క్రెడిట్‌ కార్డుల స్కాం.. రూ.23.8 కోట్ల మోసం

16 మంది భారతీయ అమెరికన్లపై కేసులు
న్యూయార్క్‌: అమెరికాలో పెద్ద ఎత్తున ఇతరుల క్రెడిట్‌ కార్డుల్ని దొంగిలించి రూ. 23.8 కోట్ల మేర మోసగించిన కేసులో 16 మంది భారతీయ అమెరికన్లపై అక్కడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ భారీ మోసంలో న్యూయార్క్‌ రాష్ట్రం క్వీన్స్‌కు చెందిన మహమ్మద్‌ రానా(40) ప్రధాన సూత్రధారి కాగా.. ఇందర్‌జీత్‌ సింగ్‌(24) ప్రధాన సహచరుడిగా విచారణలో పోలీసులు గుర్తించారు. కేసులో మొత్తం 30 మంది హస్తమున్నట్లు నిర్ధారించిన అమెరికా పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు.

వందలమంది వినియోగదారుల వ్యక్తిగత క్రెడిట్‌ సమాచారం దొంగిలించిన నిందితులు పలువురు వ్యక్తులు, ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలకు భారీగా నష్టం కలిగించినట్లు విచారణలో తేలింది. క్వీన్స్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ రిచర్డ్‌ బ్రౌన్‌ మాట్లాడుతూ...క్రెడిట్‌ కార్డు అసలు యజమానుల తరఫున కొత్త క్రెడిట్‌ కార్డులు కావాలని కోరుతూ నిందితులు బ్యాంకుల్ని కోరేవారని, క్రెడిట్‌ కార్డులు వినియోగదారులకు చేరాక వారి పోస్టుబాక్సుల నుంచి చోరీ చేసేవారని బ్రౌన్‌ తెలిపారు. దొంగిలించిన క్రెడిట్‌ కార్డుల్ని ఉపయోగించి నిందితులు గురువారం పెద్ద మొత్తంలో షాపింగ్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement