క్రెడిట్‌కార్డు చెల్లింపులపై డబుల్ పన్ను?
క్రెడిట్‌కార్డు చెల్లింపులపై డబుల్ పన్ను?
Published Mon, Jul 3 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
కొత్త పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి రావడంతో క్రెడిట్ కార్డులు లేదా ఎలక్ట్రానిక్ విధానం జరిపే చెల్లింపులకు రెట్టింపు పన్ను భరించాల్సి వస్తుందనే రూమర్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మద్దని సూచించింది. రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే యుటిలిటీ బిల్లుల పేమెంట్లకు జీఎస్టీ రెండు సార్లు చెల్లించాల్సి వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని అధియా ట్వీట్ చేశారు. అథారిటీల వద్ద చెక్ చేసుకోకుండా.. ఇలాంటి మెసేజ్‌లను సోషల్ మీడియాలో రీ-సర్క్యూలేట్ చేయవద్దని చెప్పారు.
నేషనల్ పేమెంట్ల కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోటా కూడా ఈ డబుల్ పన్నుల రూమర్లపై స్పందించారు. ఆయన కూడా ఈ రూమర్లు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. 18 శాతం జీఎస్టీ మినహా మిగతా ఎలాంటి ఛార్జీలను తాము వేయడం లేదని స్పష్టీకరించారు. అంతకముందున్న సేవాపన్ను 15 శాతం, కొత్తగా వచ్చిన పన్నుల విధానంతో 18 శాతమైన సంగతి తెలిసిందే. కాగ, జీఎస్టీ ప్రభావంతో ఫైనాన్సియల్ సెక్టార్ పన్నులు మూడు శాతం పాయింట్లు పెరగనున్నట్టు కొన్ని బ్యాంకర్లు చెప్పాయి. కాగ, వీటిని ప్రస్తుతం కూడా సర్వీసు పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అయితే తాము అదనంగా ఎలాంటి లావాదేవీల పన్ను వేయడం లేదని సీనియర్ బ్యాంకర్ చెప్పారు.
Advertisement