‘విశ్వసనీయ ఫిర్యాదుల్నే పట్టించుకుంటాం’ | Hasmukh Adhia comments over GST | Sakshi
Sakshi News home page

‘విశ్వసనీయ ఫిర్యాదుల్నే పట్టించుకుంటాం’

Published Tue, Apr 4 2017 2:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Hasmukh Adhia comments over GST

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో అక్రమ లాభార్జన నిరోధక నిబంధన విశ్వసనీయ ఫిర్యాదులనే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా చెప్పారు. ఈ నిబంధన జీఎస్టీ వల్ల తగ్గిన పన్ను వినియోగదారులకు చేరే విధంగా చేయడం కోసమే ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నిబంధనపై ఫిర్యాదులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు రూపొందించుకుంటాయని అన్నారు.

ఈ నిబంధన ప్రకారం వినియోగదారులకు ప్రయోజనం అందిందా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అది వచ్చిన ఫిర్యాదులను బట్టి ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో పోటీ అధికంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించనవసరం లేదు. పోటీ ఇటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకుంటుంది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement